ఈ ఫోటోకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులోని మహిళల్ని చూసినంతనే క్రికెట్ ప్రేమికులు ఎక్కడో చూసినట్లుందే అనుకోవటం ఖాయం. అవును.. ఈ ఇద్దరు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు. స్టార్ మహిళా క్రికెటర్లుగా పేరున్న కేథరీన్ బ్రట్.. నటాలీ స్కివర్ లు తమ రోటీన్ డ్రెస్ కు భిన్నంగా.. ఇంత అందంగా ముస్తాబు కావడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది. గతంలో ప్రేమన్నా.. పెళ్లి అన్నా అమ్మాయి.. అబ్బాయి మధ్యన సాగేది.
కొంతకాలంగా వచ్చిన మార్పుతో అబ్బాయి.. అబ్బాయిని.. అమ్మాయి.. అమ్మాయిని ప్రేమించుకోవటం.. పెళ్లి చేసుకోవటం తెలిసిందే.
ఈ ఇద్దరు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు సైతం గడిచిన ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం కోసం వారిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వీకెండ్ లో పెళ్లి చేసుకున్న కేథరీన్ బ్రంట్.. నాట్ స్కివర్ లకు తమ హృదయపూర్వక అభినందనలంటూ ఇంగ్లండ్ జట్టు తెలిపింది. గ్రాండ్ గా సాగిన వీరి వివాహ వేడుకకు పలువురు ఇంగ్లండ్ క్రికెట్ ఆటగాళ్లు.. మాజీలు హాజరయ్యారు. 2017లో ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రపంచ కప్ గెలుచుకోవటం తెలిసిందే. ఈ విజయంతో ఈ ఇద్దరు మహిళా క్రికెటర్లు కీలకంగా వ్యవహరించారు.
ప్రపంచ క్రికెట్ లో ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకొని ఒక్కటి కావటం ఇదేమీ తొలిసారిగా కాదని చెబుతున్నారు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సటర్త్ వైట్.. లియా.. దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్లు మా రిజాన్ కాప్.. డేన్ వాన్ లు కూడా పెళ్లి బంధంతో ఒక్కటైన ఉదంతాలు ఉన్నాయి. అమ్మాయిల్ని అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం బాగానే ఉన్నా.. అబ్బాయిల్ని అబ్బాయిలు పెళ్లాడిన ఉదంతాలు మాత్రం లేవంటున్నారు.
This post was last modified on May 31, 2022 10:45 am
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…