Trends

స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు: సుప్రీం కోర్టు

సెక్స్ వర్కర్లను వేధించకూడదని పోలీసులకు సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. రైడ్ లలో పట్టుబడ్డ సెక్స్ వర్కర్ల ఫొటోలను ప్రచురించకూడదని మీడియాకు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు నియమించిన కమిటీ కీలక సిఫార్సులను ఆమోదించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. సెక్స్‌ వర్కర్లను ఏవిధంగానూ వేధించరాదని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫొటోలను మీడియా ప్రచురించరాదని స్పష్టం చేసింది.

అందరికీ ఇచ్చినట్లుగానే వారికీ కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంది. వారిపై భౌతికంగా లేదా మాటలతో దాడి చేయకుండా పోలీసులు కనీస మర్యాద పాటించాలని నిర్దేశిస్తూ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఒకవేళ మీడియా వారి ఫొటోలు ప్రచురించినా.. వారి గుర్తింపును వెల్లడించినా.. ప్రచురణకర్తలపై ఐపీసీ 354సీ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ విషయంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆర్టికల్‌ 142ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్స్‌ వర్కర్లకు సంబంధించి కోర్టు నియమించిన కమిటీ కీలక సిఫార్సులు చేయగా వాటిని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమోదించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.

కోర్టు కమిటీ సిఫార్సులివే..

వ్యభిచార గృహాలు నడపడం చట్ట విరుద్ధం తప్పితే స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరం కాదు. అందువల్ల ఇలాంటి గృహాలపై దాడులు చేసినప్పుడు స్వచ్ఛందంగా ఉంటున్న సెక్స్‌ వర్కర్లను అరెస్ట్‌ చేయడం గానీ, శిక్షించడం, వేధించడం గానీ చేయకూడదు. ఏ సెక్స్‌ వర్కర్‌ అయినా లైంగికదాడికి గురైతే ఇతరులకు మాదిరిగానే వారికీ సౌకర్యాలు కల్పించాలి. సీఆర్‌పీసీ సెక్షన్‌ 357సీ ప్రకారం తక్షణ వైద్య సేవలు అందించాలి.

రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఐటీపీఏ (ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) సంరక్షణ గృహాల్లో సర్వే నిర్వహించాలి. అక్కడ వయోజన మహిళలను బలవంతంగా నిర్బంధించినట్లు తేలితే వారి పరిస్థితులను సమీక్షించి నిర్దిష్ట గడువులోగా వారిని విడిపించడానికి చర్యలు తీసుకోవాలి. సెక్స్‌ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి క్రూరంగా, హింసాత్మకంగా ఉంటోంది. వారిని అసలు హక్కులు లేని వారన్నట్లు చూస్తున్నారు. అందువల్ల ఈ విషయంలో పోలీసులు, ఇతర చట్టబద్ధ సంస్థలు సున్నితంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి. వీరికీ మిగతా పౌరుల్లాగే రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులు న్నట్లు గుర్తించాలి.

సెక్స్‌ వర్కర్ల ఫొటోలు, వారి వివరాలు వెల్లడించకుండా మీడియా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాడులు నిర్వహించి రక్షించే కార్యక్రమాలు చేపట్టినప్పుడు బాధితులు, నిందితుల ఫొటోలేవీ ప్రచురించడం లేదా ప్రసారం చేయడం వద్దు. కొత్తగా ప్రవేశపెట్టిన ఐపీసీ 354సీ సెక్షన్‌ కింద ఇతరుల లైంగిక కార్యకలాపాలను చూడటం నేరంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సెక్షన్‌ను ఎలక్ట్రానిక్‌ మీడియాపై కఠినంగా అమలు చేయాలి. రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్‌ వర్కర్లు, ఇతరుల ఫొటోలు, వివరాలు ప్రసారం చేయడం నిషేధం.

సెక్స్‌ వర్కర్లు తమ ఆరోగ్యం, భద్రత కోసం కండోమ్‌ లాంటివి దగ్గర ఉంచుకున్నప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని నేరంగా పరిగణించడానికి వీల్లేదు.

సెక్స్‌ వర్కర్లను చైతన్యపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ, రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థల ద్వారా కార్యశాలలు నిర్వహించాలి. వారికున్న హక్కులు, చట్టబద్ధత.. పోలీసులకున్న బాధ్యతలు, అధికారాలు.. చట్టం వేటిని అనుమతిస్తోంది? వేటిని నిషేధిస్తోందన్న విషయాలపై అవగాహన కల్పించాలి. హక్కుల కోసం న్యాయవ్యవస్థను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పాలి. మానవ అక్రమ రవాణాదారులు, పోలీసుల చేతుల్లో వేధింపులకు గురి కాకుండా ఎలా రక్షించుకోవాలో తెలపాలి.

సెక్స్‌ వర్కర్లందరికీ ఆధార్‌కార్డు జారీచేయాలి. వారి వివరాలు తీసుకొనేటప్పుడు ఎక్కడా సెక్స్‌వర్కర్‌గా పేర్కొనకూడదు.

This post was last modified on May 26, 2022 10:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాద్‌లో భార్య‌ను చంపి.. కుక్క‌ర్‌లో ఉడికించాడు!

ఎక్క‌డో ఢిల్లీలో రెండేళ్ల కింద‌ట ప్రియురాలిని చంపి.. ముక్క‌లు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడ‌త‌ల వారీగా వాటిని అడ‌విలో విసిరేసిన…

17 minutes ago

మెనాలిసా వజ్రాన్ని వెలికి తీసిందెవరు?

యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…

18 minutes ago

లోకేశ్ ప్రస్థానంపై చంద్రబాబు మనసులోని మాట ఇదే!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…

58 minutes ago

అభిమన్యుడు అనుకున్నారు!!… అర్జునుడు అయ్యాడు!!

నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…

2 hours ago

దావోస్ లో ‘అరకు’ ఘుమఘుమలు!

స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…

3 hours ago

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

5 hours ago