Trends

హిందీ మాట్లాడేవాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారు: మంత్రి

హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ‍్యలపై ఇప్పటికీ కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ‍్యలను మొదటి నుంచి తమిళనాడు సర్కార్‌, సీఎం స్టాలిన్‌ ఖండించిన విషయం తెలిసిందే. హిందీ అస‌లు భాషే కాద‌ని..అది సంస్కృతం లోంచి వ‌చ్చిన ద‌త్త భాష అని దీనిని ప్ర‌త్యేకంగా చ‌ద‌వాల్సిన అస‌వ‌రం లేద‌ని.. ప్ర‌త్యేకంగా నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే స‌హా.. ఇత‌ర ప‌క్షాలు కూడా అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి.

తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి హిందీపై మ‌రింత సంచలన వ్యాఖ‍్యలు చేశారు. కోయంబ‌త్తూర్‌లోని భార‌తీయ‌ర్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కే పొన్నుడి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవారు కోయంబ‌త్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. హిందీ భాష మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదే అయితే ఉత్తర భారతీయులు ఇక్కడ(తమిళనాడులో) పానీ పూరీ ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఇంగ్లీష్‌, త‌మిళ్ మాట్లాడుతారని అన్నారు. అలాగే, తాము అంత‌ర్జాతీయ భాష‌గా ఇంగ్లీష్ నేర్చుకుంటుండ‌గా ఇత‌ర భాషల‌తో ప‌నేముందని మంత్రి ఆయ‌న ప్ర‌శ్నించారు. మరో అడుగుముందుకేసి.. హిందీ కేవ‌లం ఆప్ష‌న‌ల్ ల్యాంగ్వేజ్ మాత్ర‌మేన‌ని, దాన్ని నేర్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌ని కుండబద్దలుకొట్టారు. త‌మిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటార‌ని చెప్పారు. అంతకు ముందు.. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే.

This post was last modified on May 14, 2022 12:41 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

18 mins ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

4 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

4 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

4 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

5 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

5 hours ago