Trends

పతంజలి మందు.. కరోనాను 14 రోజుల్లో తరిమేస్తుందట

కరోనా వైరస్‌ను కట్టడి చేసే మందు కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను పూర్తిగా తగ్గించేసే మందంటూ ఇప్పటిదాకా ఏదీ రాలేదు. ఇటీవలే గ్లెన్ మార్క్ సంస్థ.. ‘ఫాబి ఫ్లూ’ పేరుతో ఒక మందును ప్రవేశపెట్టింది. కరోనా తక్కువ, మధ్యస్థ స్థాయిలో ఉన్న వారికి ఈ మందు పని చేస్తుందని.. అది కూడా డోస్ ఎక్కువ ఉండాలని.. వైద్యుల సూచన మేరకే ఈ మందు వేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.

మరోవైపు సిప్లాతో పాటు మరో సంస్థ కూడా కరోనాను నియంత్రించే మందులు తీసుకొచ్చాయి. ఐతే వీటి ప్రామాణికతపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. కరోనాకు కచ్చితమైన మందంటూ ఇంకా రాలేదన్నది స్పష్టం. ఐతే ఇప్పుడు కరోనాను పూర్తిగా తగ్గించేసే ఆయుర్వేద మందును తయారు చేసినట్లు పతంజలి సంస్థ ప్రకటించడం విశేషం.

తాము కరోనాకు మందు తయారు చేస్తున్నట్లు ఇంతకుముందే పతంజలి సంస్థ ప్రకటించింది. ఇప్పుడు అన్నట్లుగానే మందును మార్కెట్లోకి తెచ్చింది. దీని గురించి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ మందు పేరు ‘కోరోనిల్’ అట. ఇవి మాత్రల రూపంలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా రెండు వారాల పాటు వాడితే కరోనాను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని రామ్‌దేవ్ బాబు పేర్కొన్నారు.

ఈ మందు తయారీ కోసం150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు.

క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని.. ఇప్పటికే తమ మందు వాడిన రోగులు అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు. మరి ఈ మందు విషయంలో కస్టమర్ రివ్యూలు ఎలా ఉంటాయో చూడాలి.

This post was last modified on June 23, 2020 10:36 pm

Share

Recent Posts

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

9 minutes ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

2 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

3 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

3 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

3 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

5 hours ago