లైంగిక వేధింపుల రాష్ట్రాల్లో ఏపీకి రెండో స్థానం

మ‌హిళ‌ల‌పై వేధింపులు అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాదాన్యం ఇస్తోంద‌ని.. ఏపీ ప్ర‌బుత్వం ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ప్ర‌త్య‌కంగా`దిశ చ‌ట్టాన్ని కూడా తీసుకువ‌చ్చామ‌ని.. ప్ర‌క‌టిస్తోంది. అంతెందుకు.. తెలంగాణ‌లో జ‌రిగిన దిశ ఘ‌ట‌న నేప‌థ్యం లో ఏపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. హుటాహుటిన‌.. దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యా ల‌కు పాల్ప‌డేవారికి క‌ఠిన శిక్ష‌లు కూడా విధిస్తామ‌న్నారు.

వేధింపులే కాదు.. అత్యాచారాల‌కు పాల్ప‌డిన వారినిఈ చ‌ట్టం కింద‌.. 21 రోజుల్లో శిక్షించి తీరుతామ‌న్నారు. కేవ‌లం మూడు రోజుల్లో చార్జీషీటు దాఖ‌లు చేయ‌డం.. 15 రోజుల్లో విచార‌ణ పూర్తిచేయ‌డం.. 21వ రోజు శిక్ష‌ను అమ‌లు చేయ‌డం.. అనే సూత్రంతో ఈ దిశ చ‌ట్టం ప‌నిచేస్తుంద‌ని గొప్ప‌గా చెప్పారు. అయితే.. ఇది జ‌రిగి.. అంటే.. దిశ చ‌ట్టం తీసుకువ‌చ్చి రెండేళ్లు అయిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా ఒక్క శిక్ష  అమ‌లు చేసింది లేదు.. అస‌లు దిశ చ‌ట్టాన్నే కేంద్రం గుర్తించింది కూడా లేదు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు ఎక్క‌డా ఆగ‌డం లేదు. మ‌రోప‌క్క‌, దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ.. పోలీసులు ప్ర‌జ‌ల‌ను ఒత్తిడి చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. స‌రే.. తాజా విష‌యానికి వ‌స్తే.. దేశంలోని ప‌ని ప్రాంతాల్లో(అవి ఆఫీసులైనా.. ఇత‌ర‌త్రా.. ఏ ప్రాంతాలైనా కానీ ) మ‌హిళ‌ల‌పై వేధింపులు పెరిగిపోయిన రాష్ట్రాల్లో జ‌గ‌న్ పాలిత‌.. ఏపీ రెండో ర్యాంకును సాధించ‌డం.. గ‌మ‌నార్హం. అంటే దీనిని బ‌ట్టి.. ఏపీలో మ‌హిళ‌ల‌పై వేధింపులు ఏరేంజ్‌లో పెరిగిపోయాయో.. అర్ధం చేసుకోవ‌చ్చు.

ఈ విష‌యాన్ని నేష‌న‌ల్ క్రైం రికార్డ్స్‌ బ్యూరో.. వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. గత ఏడాది మొత్తం 70 కేసులు న‌మోదైన‌ట్టు ఈ నివేదిక వెల్ల‌డించింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ 72 కేసుల‌తో తొలిస్థానంలోనూ..ఏపీ 70 కేసుల‌తో రెండో స్థానం, మ‌హారాష్ట్ర 66 కేసుల‌తో మూడో స్థానంలోనూ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 46 కేసుల‌తో నాలుగోస్థానం, మ‌ధ్య ప్ర‌దేశ్ 40 కేసుల‌తో ఐదో స్థానంలో ఉంద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. 2019తో పోల్చుకుంటే… 2020లో ఏపీలో వేధింపుల కేసులు 219 శాతం పెరిగిన‌ట్టు నివేదిక తెలిపింది.