Trends

బంజారాహిల్స్‌ డ్ర‌గ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టు ఇదే!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేపిన బంజారాహిల్స్‌ పుడింగ్ ప‌బ్‌ డ్ర‌గ్స్ కేసులో రిమాండ్ రిపోర్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. పబ్‌లో మద్యం, డ్రగ్స్‌ విక్రయాలపై సమాచారం వచ్చిందని రిమాండ్‌ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు. ఈ నెల 3న పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి చేసినట్లు తెలిపారు. రాడిసన్ బ్లూప్లాజాలోని పుడింగ్ పబ్‌లో పోలీసుల తనిఖీలు చేసినట్లు చెప్పారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, ప్యాకింగ్ మెటీరియల్ గుర్తించినట్లు పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదనకు పబ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, పబ్‌లో 5 డ్రగ్స్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతూ పబ్‌ మేనేజర్ అనిల్‌కు చెందిన ట్రేలో డ్రగ్స్ లభ్యమైనట్లు పేర్కొన్నా రు.

ప్యాకెట్లలోని తెల్లని పౌడర్ కొకైన్‌గా తేలిందని చెప్పారు. కొకైన్ 4.64 గ్రాముల బరువు ఉందని.. అనిల్‌ను అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌, ఐపాడ్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. అనిల్ ఇచ్చిన సమాచారంతో పబ్ నిర్వాహకుడు అభిషేక్ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అభిషేక్‌ను అరెస్ట్ చేసి ఐఫోన్ సీజ్ చేశామని… ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్లో పోలీసులు వివరించారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌లో ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి కొకైన్‌, గంజా, ఎల్ఎస్‌డీ మత్తు పదార్థాలు సేవిస్తూ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతోందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో డేకాయ్ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసులను గుర్తించిన యువతీ యువకులు వారి వద్ద ఉన్న మత్తు పదార్థాలను కిటకీల గుండా బయట పారేసి కనిపించకుం దాచేశారు. పక్కా సమాచారంతో ఉత్తర మండల, మధ్య మండల, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌ను చుట్టుముట్టారు.

పబ్లో ఉన్న యువతీ యువకులు, నిర్వాహకులు, సిబ్బందితో సహా మొత్తం 148 మందిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వీరితో పాటు పబ్‌ సమీపంలో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు ప్రముఖుల కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పోలీసు అధికారుల పిల్లలు కూడా ఉన్నట్లు ప్రచారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరందరిని బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన పోలీసులు వారి వివరాలను నమోదు చేసుకుని పంపించారు. తాజాగా దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు స‌మ‌ర్పించారు.

This post was last modified on April 7, 2022 12:57 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

11 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago