ఏపీలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సంపన్న వర్గాలకు ఇస్తున్న విద్యుత్ యూనిట్ కు 55 పైసలు పెరగ్గా.. పేద, మధ్యతరగతి వర్గాలపై మాత్రం భారీ ఎత్తున బాదేశారు. అయితే.. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి. సున్నా నుండి 30 యూనిట్ల వరకు గత ధర రూ.1.45 పైసలు ఉండగా.. మండలి ఆమోదించిన ధర రూ.1.90పైసలుగా ఉంది. దీంతో పెంపు 45 పైసలైంది.
31 నుంచి 75 యూనిట్ల వరకు రూ.2.09 పైసల నుండి రూ.3.00 పెంపుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ టారిఫ్‌లో ఉన్న వినియోగదారులు.. 91 పైసల భారం పడనుంది. ఇక, 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు రూ.3.10 నుండి రూ.4.50లకు పెంపునకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్కు 1.40 పైసలు చొప్పున పెరిగింది.
అదేవిధంగా 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.4.43 నుండి రూ.6.00 పెంపుకు మండలి ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్‌కు రూ.1.57 పైసలు చొప్పున భారం పడింది. ఇక, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.7.59 నుండి రూ.8.75 వరకు పెంపుకు ఆమోదం తెలిపారు. ఫలితంగా యూనిట్ రూ. 1.16 పైసలు, చొప్పున పెరగ నుంది.
అదేసమయంలో 400 యూనిట్ల పైన రూ.9.20 నుండి రూ.9.75కు పెంపుకు ఆమోదం తెలపగా.. యూనిట్ విద్యుత్ పై 55 పైసల చొప్పున భారం పడింది. ఫలితంగా పేద , మధ్య తరగతి ప్రజలకు అదనపు భారం మొపగా.. సంపన్నులకు కేవలం పెంచినది 55 పైసలు కావడం గమనార్హం. పేదలకు ఆదాయం పెరుగకపోగా అదనపు భారం పెంపుపై పేద , మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఇలా పెరిగాయి..
30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు
31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు
126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు
226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు
400 యూనిట్ల పైన యూనిట్‌కు 55 పైసలు పెంపు
This post was last modified on March 30, 2022 5:41 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…