రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.
అంతకుముందు జరిగిన కొన్ని ముఖాముఖి చర్చలు విఫలమైన నేపథ్యంలో శాంతి చర్చలపై ఉక్రెయిన్కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. ఇస్తాంబుల్ చర్చల తర్వాత.. పుతిన్, జెలెన్స్కీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు, ఉక్రెయిన్ భద్రత వంటి అంశాలే లక్ష్యంగా ఇస్తాంబుల్లో చర్చలు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వివరించారు.
ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు ఫలప్రదంగా సాగడం వల్ల చమురు సరఫరాపై ఉన్న భయాలు వీడాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 5శాతానికిపైగా తగ్గింది. మరోవైపు రష్యా కరెన్సీ రూబెల్ విలువ 10శాతం మేర పెరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న చమురు సంక్షోభాన్ని తగ్గిస్తుందని.. పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. నిత్యవస ర సరుకుల ధరలతో పాటు.. యుద్ధం కారణంగా.. పలు దేశాల్లో ఏర్పడిన ఆర్తిక సంక్షోభం కూడా తగ్గుముఖం పడుతుందని.. అంటున్నారు. కాగా, దాదాపు నెల రోజులుగా సాగుతున్న యుద్దంలో ఇప్పటి వరకు వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా.. ఇరు దేశాల సైనికులు కూడా ప్రాణత్యాగం చేశారు.
పలు దఫాలు చర్చలు సాగినా.. ఇప్పటి వరకు ఇరు దేశాలు బెట్టు వీడలేదు. అయితే.. రష్యా పరిస్థితి దయనీయంగా మారడం.. ప్రపంచ దేశాల నుంచి ఆంక్షలు పెరుగుతుండడంతో.. రష్యా ఒకింత దిగివచ్చినట్టు తెలుస్తోంది. ఇక, ఉక్రెయిన్ కూడా కొన్ని షరతులకు అంగీకారం తెలిపింది. నాటో కూటమిలో చేరేది లేదని.. ఇప్పటికే అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ పరిణామాలతో తాజాగా జరిగిన చర్చలు ఫలించాయి. త్వరలోనే యుద్ధమేఘాలు వీడిపోయి.. ఇరు దేశాలు ఒప్పందాలపై దృష్టి పెట్టనున్నాయని తెలుస్తోంది.
This post was last modified on March 29, 2022 9:32 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…