ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా మారాడు అంటే నమ్మగలరా? ఇదేం విడ్డూరం? ఆయనేమైనా సినిమాలో నటిస్తున్నాడా? అందులో భాగంగా క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాడా అన్న సందేహాలు కలగొచ్చు. కానీ ఇది రీల్ ఇన్సిడెంట్ కాదు. రియల్ ఇన్సిడెంట్. ఎప్పుడో మంత్రిగా పని చేసి మొత్తం ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాక క్యాబ్ డ్రైవర్‌గా మారాల్సిన పరిస్థితి తలెత్తిందేమో అనుకోవడానికి కూడా వీల్లేదు.
ఆ వ్యక్తి కేవలం ఆరు నెలల ముందు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. కానీ కొన్ని నెలల్లో పరిస్థితులు తలకిందులై కుటుంబాన్ని పోషించుకోవడానికి క్యాబ్ డ్రైవర్‌గా మారక తప్పలేదు. నమ్మశక్యం కాని ఈ కథేంటో చూద్దాం పదండి. ఖాలిద్ పయెండా.. ఆరు నెలల ముందు వరకు ఆఫ్ఘనిస్థాన్ దేశ ఆర్థిక మంత్రి. ఐతే గత ఏడాది తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకోవడం తెలిసిందే.
దీంతో అప్పటిదాకా ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నేతలంతా దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు పరిస్థితి తీవ్రతను గుర్తించి ముందే మరో దేశంలో వెళ్లి ఏ ఇబ్బందీ లేకుండా స్థిరపడటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకొందరేమో పీకల మీదికి వచ్చాక కానీ అప్రమత్తం కాలేదు. ఖాలిద్ రెండో కోవకే చెందుతాడు. గత ఏడాది దేశ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన ఖాలిద్.. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకోవడానికి వారం ముందు తన పదవికి రాజీనామా చేశాడు.
వెంటనే కుటుంబంతో కలిసి అమెరికాకు పయనమయ్యాడు. ఆయన సంపాదనంతా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉండిపోయిందో ఏమో కానీ.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆయన కుటుంబం కోసం ప్రస్తుతం క్యాబ్ నడుపుతున్నాడు. రోజుకు 150 డాలర్ల వరకు సంపాదిస్తూ ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒక దేశానికి మంత్రిగా ఉన్న వ్యక్తి కొన్ని నెలల్లో ఇలా క్యాబ్ డ్రైవర్‌గా మారిన వైనం ప్రపంచ చరిత్రలోనే అరుదనడంలో సందేహం లేదు.
This post was last modified on March 23, 2022 12:35 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……