Trends

రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా ?

ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన రూపాయికి అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా డాలర్ కున్న విలువ మరే కరెన్సీకి లేదు. ప్రపంచంలో ఏమూలకు వెళ్ళినా అమెరికా డాలర్ అంటే హాట్ కేకులాగ చెలామణి అయిపోతుంది. అందుకనే అమెరికా డాలర్ అంటే యావత్ ప్రపంచంలో అంత క్రేజుంది.

అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ గురించి ఆలోచిస్తున్నాయట. దీనికి కారణం ఏమిటంటే వీళ్ళ యుద్ధం వల్ల చాలా దేశాల వ్యాపారాలపై  తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా రష్యాతో వ్యాపారాలు చేస్తున్న ఇండియా, యూరోపు దేశాలపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. రష్యాకు ఎగుమతులు, దిగుమతులపై అమెరికా నిషేధం విధించడం పెద్ద సమస్యగా మారిపోయింది. దీనివల్ల ఏమైందంటే రష్యా నుండి ఎగుమతయ్యే గ్యాస్, చమురు, సహజవాయుల వ్యాపారానికి పెద్ద దెబ్బపడింది.

ఇందులో భాగంగానే ఇప్పటివరకు భారత్ కొన్న ధరలకన్నా చమురును తక్కువ ధరలకే ఇస్తామంటూ రష్యా ఆఫర్ ఇచ్చింది. యుద్ధం కారణంగా రష్యాకు అమెరికా డాలర్లు ఇచ్చే అవకాశం ఎలాగు లేదు. దాంతో మన రూపాయల్లోనే చెల్లింపులు తీసుకునే విషయాన్ని రష్యా పరిశీలిస్తోంది.  రష్యా రూబల్స్ లో కూడా చెల్లింపులు చేయవచ్చు కానీ అంత పెద్దమొత్తంలో మన దగ్గర రూబుల్స్ లేవు. కాబట్టి రూపాయల్లో కానీ లేదా బంగారం రూపంలో కానీ చెల్లింపులను పరిశీలిస్తున్నారు.

పై రెండు పద్దతులకు రష్యా దాదాపు ఆమోదం తెలిపే అవకాశముంది. అయితే ఇందులో కూడా బంగారం కాకుండా రూపాయల్లోనే చెల్లింపులకు మనదేశం ప్రయత్నిస్తోంది. ఒకసారి రష్యా అంగీకరిస్తే మన రూపాయికి అంతర్జాతీయ గుర్తింపుకు మొదటి మెట్టు ఎక్కినట్లే. ఎందుకంటే ఇదే పద్దతిని కేంద్రప్రభుత్వం ఇతర దేశాలతో కూడా షరతులు విధిస్తుంది. ఎలాగూ యుద్ధం కారణంగా చాలా దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే మరికొన్ని దేశాలు కూడా మన రూపాయలను తీసుకునే అవకావముంది. అదే జరిగితే మన రూపాయికి కూడా అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు రావటం ఏమంత కష్టంకాదు. నిజంగా ఇది మనకు హ్యాపీ న్యూసనే చెప్పాలి.

This post was last modified on March 15, 2022 12:19 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

30 mins ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

1 hour ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

5 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

5 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

5 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

6 hours ago