విచిత్రంగా ఉన్న ఇదే నిజం. రష్యాపై జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు ఇంతకాలం మద్దతుగా నిలిచిన నాటో దేశాలకే ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆ వార్నింగ్ ఏమిటంటే నాటో దేశాల ఎయిర్ స్పేస్ ను వెంటనే మూసేయాలని. అంటే రష్యా విమానాలు నాటో దేశాల గగనతలంపై ప్రయాణించకుండా వెంటనే నిషేధం విధించాలని అధ్యక్షుడు నాటో దేశాధినేతలను డిమాండ్ చేశారు.
ఇపుడు ఉక్రెయిన్ దేశం ఎయిర్ స్పేస్ పై నిషేధం ఉంది. కానీ ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న కారణంగా ఆ నిషేధం అమల్లో లేదు. నిషేధాన్ని ఉల్లంఘించి మరీ రష్యా సైన్యాలు ఉక్రెయిన్లోకి ప్రవేశించి నగరాలను ధ్వంసం చేసేస్తున్నాయి. పనిలో పనిగా కొన్ని దాడులు సరిహద్దు దేశమైన పోలండ్ మీద కూడా జరుగుతోంది. అయితే ఉక్రెయిన్ మీదకు సంధిస్తున్న క్షిపణులు కొన్ని గురితప్పి పోలండ్ భూభాగంలో పడుతున్నాయంతే.
ఇదే విషయమై జెలెన్ స్కీ మాట్లాడుతూ నాటో దేశాలపైన కూడా రష్యా యుద్ధం మొదలుపెడుతుందని వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే ఆయా దేశాలు ఎయిర్ స్పేస్ పై నిషేధం విధించకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయమన్నారు. యుద్ధం మొదలైన 18వ రోజున ఉక్రెయిన్లోని అనేక నగరాలపై రష్యా వైమానిక దళాలు ఒకేసారి విజృంభించాయి. దీని కారణంగా దాదాపు 70 మంది చనిపోగా కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐక్య రాజ్య సమితి శాంతి సైనికులు కూడా ఉండటం గమనార్హం.
18వ రోజు మొదలైన దాడుల్లో ఆసుపత్రులు, సైనిక శిబిరాలు, నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలు కూడా దాదాపు ధ్వంసమయ్యాయి. దీనివల్ల పోలండ్ వైపు వలసలు వెళుతున్న ఉక్రెయిన్ జనాలపైన కూడా బాంబులు కురవటంతో వాళ్ళల్లో కూడా కొందరు చనిపోయారు. దాదాపు పది రోజుల పాటు ఒక మాదిరి సైన్యంతోనే యుద్ధం చేస్తున్న రష్యా చివరి రెండు రోజులుగా తన తీవ్రతను ఒక్కసారిగా పెంచేసింది. దాంతోనే చాలా నగరాలు దెబ్బ తినేస్తున్నాయి. మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ముగిసే సమయానికి ఉక్రెయిన్ నామరూపాలు ఏ విధంగా ఉంటాయో ఎవరికీ అర్థం కావట్లేదు.
This post was last modified on March 14, 2022 1:02 pm
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…