Trends

రష్యా భారీ మూల్యమే చెల్లించిందా ?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రెండువైపులా భారీ నష్టాలు కనబడుతున్నాయి. ఉక్రెయిన్ సంగతిని పక్కన పెట్టేస్తే అగ్రరాజ్యం తో పోటీపడుతున్న రష్యా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చిట్టెలుకే కదాని ముందు ఉక్రెయిన్ను తేలిగ్గా తీసుకున్న కారణంగానే భారీగా నష్టపోవాల్సొచ్చిందట. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకారం 12 వేల మంది రష్యా సైనికులు చనిపోయారట. ఉక్రెయిన్ పై యుద్ధంలోనే ఇన్ని వేల మంది చనిపోవడం చిన్న విషయం కాదు.

పైగా చనిపోయిన వారిలో ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఇద్దరు ఒక మేజర్ జనరల్ తో పాటు ఇద్దరు జనరల్ స్థాయి అధికారులుండటం రష్యాకు పెద్ద దెబ్బనే చెప్పాలి. చనిపోయిన సైనికులు కాకుండా 49 ఫైటర్ విమానాలు, 80 ఫైటర్ హెలికాప్టర్లు, 303 యుద్ధ ట్యాంకులు, 1100 ఆర్మీ వాహనాలు, 30 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

రష్యా ముందు ఉక్రెయిన్ ఏమాత్రం నిలవలేదు. అందుకనే మొదటి నుండి చాలా తేలిగ్గా తీసుకుంది. అయితే యుద్ధం మొదలైన మూడు రోజుల తర్వాత ఉక్రెయిన్ దగ్గరున్న ఆయుధాలను చూసి రష్యా ఆశ్చర్యపోయింది. నిజానికి రష్యా యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లను కూల్చేసేంత సీన్ ఉక్రెయిన్ రక్షణశాఖ దగ్గర లేదు. రష్యా మీద కోపంతో అమెరికా స్టింగర్ యాంటి ట్యాంకు మిస్సైల్స్ ను, విమానాలు, హెలికాప్టర్లను కూల్చేయగలిగిన క్షిపణులను ఉక్రెయిన్ కు అందించింది.

అమెరికాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, చెకొస్లొవేకియా, స్వీడన్ లాంటి దేశాలు అత్యంత ఆధునిక ఆయుధాలను అందించాయి. అందించటమే కాకుండా ఎలా ఉపయోగిస్తే రష్యా విమానాలు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను కూల్చవచ్చో సూచనలిచ్చి మరీ కూల్చివేశాయి. దాంతోనే రష్యాకు భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఉక్రెయిన్ సైన్యంతో పాటు మామూలు జనాలు కూడా ప్రభుత్వం అందించిన తుపాకులు, గ్రనేడ్లు యధేచ్చగా ప్రయోగిస్తుండటతో రష్యాకు చుక్కలు కనబడుతున్నాయి. అందుకనే ఆయుధాల ధ్వంసంతో పాటు వేలాది మంది సైన్యం చనిపోయారు.  చిట్టెలుక ఉక్రెయిన్ సైన్యం చనిపోవటం గొప్పకాదు. రష్యా సైన్యం చనిపోవటమే పెద్ద దెబ్బ. 

This post was last modified on March 10, 2022 2:22 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago