ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం పదిరోజులకు చేరుకున్న నేపధ్యంలో ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన పడుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే రష్యా చేతిలో బ్రహ్మాస్త్రం అనదగిన డెడ్ హ్యాండ్ వెపన్ యాక్టివేషన్ కు రెడీ అవుతుండటమే. అగ్రరాజ్యం అమెరికా నుండి తనను తాను కాపాడుకోవటానికి రష్యా తయారుచేసుకన్న అత్యంధానిక ఆయుధమే డెడ్ హ్యాండ్. ఉక్రెయిన్లోని అణుకేంద్రాలపై రష్యా సైన్యం చేసిన దాడుల నేపధ్యంలో మళ్ళీ డెడ్ హ్యాడ్ అనే వెపన్ పై చర్చలు మొదలయ్యాయి.
మామలూగా ఒకదేశం మరోదేశంపై అణుదాడి చేస్తే దాడికి గురైన దేశం తిరిగి అణుదాడిని చేసే అవకాశాలు 99 శాతం ఉండదు. ఎందుకంటే అణుదాడి కారణంగా ఉత్పన్నమైన పరిస్ధితులనుండి బయటపడేందుకే సమయం మొత్తం సరిపోతుంది. కాబట్టే ఎదురుదాడికి అవకాశాలు దాదాపు ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రష్యా ప్రత్యామ్నాయ వ్యవస్ధను రష్యా ఏర్పాటుచేసుకుంది.
ఒకవేళ అమెరికా గనుక రష్యాపై అణుదాడి చేస్తే రష్యా అత్యున్నత నాయకత్వం, న్యూక్లియర్ కమాండ్ నూరుశాతం దెబ్బతిన్నా తనంతట తానుగా కమాండ్లు ఇచ్చుకుని పనిచేసేట్లుగా ఏర్పాటు చేసిన వ్యవస్ధే డెడ్ హ్యాండ్ వ్యవస్ధ. ఈ డెడ్ హ్యాండ్ ఏర్పాటులో 700 వాహకాలు ఉంటాయట. వీటిల్లో స్ట్రాటజిక్ బాంబర్లు, న్యూక్లియర్ సబ్ మెరైన్లు, భూగర్భ బొరియల్లో దాచిన ఖండాతర క్షిపణలున్నాయట. అత్యంత శక్తవంతమైన కమ్యూనికేష్ వ్యవస్ధ ఆధారంగా డెడ్ హ్యాండ్ పనిచేస్తుందట.
అవసరమైతే మాన్యువల్ గాను లేకపోతే తనంతట తానుగానే యాక్టివేట్ చేసుకోగలిగన వ్యవస్ధను రష్యా రెడీచేసిందట. దీనికోసం రాడార్లు, శాటిలైట్లతో సమన్వయం చేసుకుంటే సరిపోయే వ్యవస్ధను ఏర్పాటు చేశారట. రష్యాపై అణుదాడి జరగ్గానే దేశంలోని వివిధ చోట్ల ఏర్పాటుచేసిన సెన్సర్ల ఆధారంగా డెడ్ హ్యాండ్ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అయిపోతుందట. యాక్టివేట్ అవటానికి కేంద్ర సైనికాధికారులకు సంకేతాలు పంపుతుందట. నిర్దిష్టమైన సమయంలోగా కమాండ్ రాకపోతే తర్వాత తనంతట తానుగానే యాక్టివేట్ అయిపోతాయట.
This post was last modified on March 5, 2022 12:17 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…