Trends

దేశం కోసం గన్ పట్టిన మహిళా ఎంపీ

ఉక్రెయిన్ మీద సైనిక చర్యకు అనుమతిస్తూ రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయం వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఉక్రెయిన్ మీద రష్యా సంపూర్ణ అధిక్యతను ప్రదర్శిస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. దీన్ని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు ఖండిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని.. వాస్తవం వేరుగా ఉందని ఆయన చెబుతున్నారు.
 

తమ దేశంపై రష్యా దాడులతో విరుచుకుపడుతున్న వేళ.. అనూహ్యంగా రియాక్టు అయిన  ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు ఇప్పటికే వార్ ఫీల్డ్ లో స్వయంగా తిరుగుతూ అందరికి కొత్త స్ఫూర్తిగా మారారు. తమ దేశాన్ని కబళించాలన్న కసితో ఉన్న పుతిన్ కు షాకిచ్చేందుకు ఎవరికి వారుగా ముందుకు వచ్చేందుకు వీలుగా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒక ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యురాలు.. మహిళా ఎంపీ కిరా రుడిక్.. తాను సైతం రష్యా మీద యుద్ధం చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఏదో మాట వరసకు కాకుండా.. కలాష్నికోవ్ ఆయుధాన్ని చేతబట్టిన ఆమె.. తాను ఆయుధాన్ని ఉపయోగించటం నేర్చుకోవటమే కాదు.. ధరించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. తన మాదిరే ఉక్రెయిన్ లోని చాలామంది రష్యా దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లుగా పేర్కొన్నారు. మహిళలు.. పురుషులు అన్న తేడా లేకుండా అందరూ తమ నేలను కాపాడుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పుతిన్ ఉక్రెయిన్ హక్కును ఎలా రిజెక్టు చేస్తారన్న ప్రశ్నను సంధించటమే కాదు.. తనను.. తన కుటుంబాన్ని  బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తాను తన కుటుంబాన్ని పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తనను.. తన కుటుంబాన్ని అంతమొందిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

తన మాదిరేతన తోటి శాసన సభ్యులు.. ఉక్రెయిన్ సైనికులు చాలా పోరాడుతున్నారన్నారు. ఉక్రెయిన్ మహిళా ప్రజాప్రతినిధులు తమ దేశాన్ని కాపాడేందుకు వీలుగా ఎవరికి వారుగా.. అత్యాధునిక ఆయుధాలను స్వయంగా చేపట్టినట్లుగా పేర్కొన్నారు. తాము యుద్దాన్ని ప్రారంభించలేదని.. తాము తమ దేశంలో తమ జీవితాలను శాంతిభద్రతలతోజీవించాలనికోరితే.. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. దేశాన్ని రక్షించేందుకు ఆయుధాలు ధరించాల్సిన అవసరం లేదని.. తమ దేశంలోకి అక్రమంగా చొరబడితే.. వారికి సరైన రీతిలో బుద్ది చెబుతామని సదరు మహిళా ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారి కంటే భిన్నంగా తాము రియాక్టు అవుతామని పేర్కొన్నారు. మరేం జరుగుతుందో చూడాలి మరి.

This post was last modified on February 27, 2022 4:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘గేమ్ ఛేంజర్’లో తెలుగు రాష్ట్రాల సంఘటనలు : దిల్ రాజు!

అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…

30 minutes ago

పుష్ప-2 బాక్సాఫీస్ : బాహుబలి రికార్డు బ్రేక్ అయ్యేనా??

ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…

51 minutes ago

ఫ్యాన్స్ కోరుకున్న ‘ధోప్’ స్టెప్పులు ఇవే చరణ్!

ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…

1 hour ago

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

5 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

13 hours ago