Trends

కులాంతర పెళ్లి చేసుకున్నా.. కుమార్తె బాధ్య‌త తండ్రిదే: హైకోర్టు

త‌మ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంద‌ని.. లేదా.. కులాంతర వివాహం చేసుకుంద‌ని.. త‌ల్లిదండ్రులు ఇక ఆమెను వ‌దిలించుకుం టామంటే కుద‌ర‌దు. ఆ యువ‌తి ర‌క్ష‌ణ‌, ఆర్థిక బాధ్య‌త‌ల‌ను తండ్రి చూడ‌వ‌ల‌సిందే. ఈ మేర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు యువ‌తి తండ్రి అన్ని విధాలా ఆమెకు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందేన‌ని.. మైనార్టీ తీరిన త‌ర్వాత‌.. వివాహం అనేది ఆ యువ‌తి తీసుకునే వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం  ఆమె స్వేచ్ఛ‌ ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని.. అలాగ‌ని త‌మ బాధ్య‌తల నుంచి తండ్రి త‌ప్పించుకోలేర‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు భోపాల్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ ఎంఎస్ భట్టిలు తీర్పు వెలువ‌రించారు.  

ఏం జ‌రిగింది?

మధ్య ప్రదేశ్ హోషంగాబాద్‏కు చెందిన ఫైజల్ ఖాన్.. ఓ యువ‌తిని(19)ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే.. ఇది కులాంత‌ర వివాహ‌మ‌ని భావించిన యువ‌తి త‌ల్లిదండ్రులు.. పోలీసుల‌ను ఆశ్ర‌యించి.. త‌మ కుమార్తె క‌నిపించ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. దీంతో ద‌ర్యాప్తు జ‌రిపిన పోలీసులు.. యువ‌తీయువ‌కుల‌ను వెతికి ప‌ట్టుకున్నారు. ఈ స‌మ‌యంలో యువ‌తి.. త‌న ఇష్ట‌ప్ర‌కార‌మే అత‌నిని వివాహం చేసుకున్న‌ట్టు చెప్పింది.

అయితే.. ఈ ఘ‌ట‌న‌ను జీర్ణించుకోలేని త‌ల్లిదండ్రులు మ‌రోసారి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో ఫిబ్రవరిలో ఇటార్సీ పోలీసులు ఎస్డీఎం ముందువారి స్టేట్ మెంట్ రికార్డ్ చేయడానికి పిలిపించారు. అదే సమయంలో అమ్మాయి తల్లితండ్రులు ఆమెను బలవంతగా మహిళ ఆశ్రమానికి పంపించారు. దీనిపై ఫైసల్ ఖాన్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రియురాలిని ఆమె కుటుంబసభ్యులు మహిళా ఆశ్రమంలో బంధించారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని.. ప్రస్తుతం ఆమె వయసు 19 సంవత్సరాలను.. తన ప్రియురాలి కంటే తను వయసులో పెద్దవాడినని పేర్కోన్నాడు. జనవరి మొదటి వారంలో తన ప్రియురాలి ఇంటి నుంచి బయటకు వచ్చి తనతోపాటే నివసిస్తుందని తెలిపారు.

దీనిపై విచారణ జరిగిన అనంతరం ఆ యువతి తన ప్రియుడితో కలిసి ఉంటానని చెప్పింది. అనంత‌రం.. ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఈ పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు మాత్రమే అని.. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత పెళ్లి జరిపించాలని.. కులాంతరం వివాహం జరిగిన తర్వాత కూడా కూతురు బాధ్యత తండ్రికి ఉంటుందని హైకోర్టు తెలిపింది. వివాహం జరిగిన తర్వాత తమ కూతురుకు ఎల్లప్పుడు రక్షణగా ఉంటూ తనకు ప్రేమను అందించాలని.. అలాగే ఆర్థిక సాయం కూడా చేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.

This post was last modified on February 23, 2022 7:24 pm

Share

Recent Posts

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

1 hour ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

1 hour ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

1 hour ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

2 hours ago

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…

3 hours ago

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

5 hours ago