సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని “అనైతిక చర్య”గా చూడగలిగినప్పటికీ, దానిని “దుష్ప్రవర్తన”గా పరిగణించలే మని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితం కాదు
అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది.
ఓ కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్‌క్వార్ట ర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. దీంతో పోలీసు శాఖ ఆయనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాడు. దీనిని విచారించిన మహిళా న్యాయమూర్తి సంగీతా విషెన్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని తీర్పు వెలువరించారు. మరోవైపు పిటిషనర్ కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, ప్రతిదీ తమ ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్‌మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆ జంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు.
ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్‌మెంట్‌లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే కోర్టు మాత్రం విచారణ జరపకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించి రద్దు చేసి పక్కన పెట్టిందని ఉత్తర్వులో పేర్కొంది. అంతేకాదు పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఒక పోలీసును తొలగించడానికి ఇది కారణం కాదని, పైగా అది అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది.
This post was last modified on February 17, 2022 6:22 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…