విన్నంతనే.. అయ్యో పాపం అనిపించటమే కాదు.. చనిపోవటం కోసమే అమెరికాకు వెళ్లినట్లుగా అనిపించక మానదు. ఏపీలోని విశాఖకు చెందిన 27 ఏళ్ల సత్యక్రిష్ణ చిట్టూరి అనే యువకుడు దోపిడీ దొంగలు జరిపిన కాల్పులకు బలయ్యాడు. గత ఏడాదే ఇతడికి పెళ్లి కాగా.. ప్రస్తుతం భార్య గర్భవతి. ఉన్నత విద్య కోసం గత నెలలోనే అప్పు చేసి మరీ అమెరికాకు వెళ్లిన ఇతడు.. అనూహ్యంగా దోపిడీదారుల చేతుల్లో బలైపోయిన వైనం జీర్ణించుకోలేనిదిగా మారింది. అసలేం జరిగిందంటే..
విశాఖపట్నానికి చెందిన సత్య క్రిష్ణ అమెరికాలో ఉన్నత విద్య కోసం అప్లై చేశాడు. అలబామ రాష్ట్రంలోని బిర్మింగ్ హామ్ ల్ లో ఒక క్రౌన్ సర్వీస్ స్టేషన్ లో క్లర్క్ గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరి 11న సత్యక్రిష్ణ పని చేస్తున్న స్టోర్ కు దోపిడీ దొంగలు వచ్చారు.
ఆయుధాలు చేతబట్టి స్టోర్ లోకి చొరబడిన దుండగులు.. స్టోర్ లోకి వచ్చీ రాగానే.. కాల్పులు జరపటం..అవి కాస్తా అక్కడే పని చేస్తున్న వంశీక్రిష్ణ శరీరంలోకి దూసుకెళ్లిపోయాయి. దీంతో.. అతగాడు కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే మరణించాడు. సత్య క్రిష్ణ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఫోటోల్ని పోలీసులు విడుదల చేశారు. దోపిడీ దారుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలంటూ పోలీసులు ప్రకటనను విడుదల చేశారు.
అనుమానితుడు నల్ల చొక్కా ధరించి.. అరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నట్లుగా గుర్తించారు. ఓపక్క భార్య నిండు గర్భవతి కావటం.. పెళ్లై ఏడాది మాత్రమే అయిన వేళలో.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ విషాదంతో వంశీ క్రిష్ణ ఇంట్లోని వారంతా తల్లిడిల్లి పోతున్నారు. వారి రోదనలు విన్న వారంతా కదలిపోతున్నారు. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలోని హుక్కా లాంజ్ లో ఇటీవల కాల్పులు జరపటం.. అందులో ఒకరు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా జరిగిన ఈ విషాదం సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates