రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందులో 14,450 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారవర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో మూడో వంతు మందికి కరోనా ఉండటమంటే మామూలు విషయం కాదు. జనవరి 10వ తేదీన రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు 4 శాతం ఉంది.
అలాంటిది 23వ తేదీకి పాజిటివిటీ రేటు 31 శాతానికి పెరిగింది. అంటే 14 రోజుల్లో పాజిటివిటీ రేటు 27 శాతం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో కనబడుతోంది. ఒక్క ఆదివారం మాత్రమే జిల్లాలో 2258 కేసులు నమోదయ్యాయి. వారం క్రితంవరకు కేవలం 2 జిల్లాల్లో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఇపుడు కృష్ణా జిల్లా తప్ప మిగిలిన 12 జిల్లాల్లో సగటున 500 కేసులు నమోదవుతున్నాయి. వీటిల్లో కూడా 8 జిల్లాల్లో సగటున వెయ్యి కేసులు రికార్డవుతుండటమే టెన్షన్ పెంచేస్తోంది.
ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరులో 1438 కేసులు, ప్రకాశ జిల్లాలో 1399 కేసులు, కర్నూలు జిల్లాలో 1238 కేసులు, చిత్తూరు జిల్లాలో 1138, నెల్లూరు జిల్లాలో 1103 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1012 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 18వ తేదీన 462 కేసులు నమోదైతే 23వ తేదీ వచ్చేటప్పటికి 1534 కేసులకు పెరిగింది. గుంటూరు జిల్లాలో కూడా 758 కేసుల నుండి 1438 కేసులకు పెరిగింది.
ఒకపుడు బాగా కేసులు నమోదైన చిత్తూరు జిల్లాలో ఇపుడు క్రమంగా తగ్గుతోంది. ఇక్కడ ప్రధానంగా టీటీడీ తీసుకుంటున్న చర్యలతో పాటు ఇతర అధికార యంత్రాంగం కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవటం వల్ల కేసుల సంఖ్య తగ్గుతోంది. ఏదేమైనా కరోనా వైరస్+ఒమిక్రాన్ కేసులు కొన్ని జిల్లాల్లో బాగా పెరుగుతు మరికొన్ని జిల్లాల్లో తక్కువగా ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కేసుల సంఖ్య తగ్గే అవకాశముంది. మొత్తానికి అధికార యంత్రాంగం మరికొంత కొంతకాలం పాటు రిలాక్సయ్యేందుకు అయితే లేదు.
This post was last modified on January 24, 2022 11:52 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…