మాల్యాకు లండన్ కోర్టు షాక్

ఆర్ధిక నేరగాళ్ళ బుద్ధి ఎక్కడున్న ఒకే పద్ధతిలో ఉంటుంది. ఒక దేశంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం, మరో దేశంలో తీసుకున్న అప్పులను చెల్లించటం అంటు ఉండదని తాజాగా నిరూపణైంది. దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుని పారిపోయిన విజయమాల్య వ్యవహారం ఒకటి తాజాగా వెలుగు చూసింది. మాల్యా ఆస్తుల విషయంలో లండన్ కోర్టు ఇచ్చిన తీర్పే ఆయన వైఖరికి నిదర్శనంగా మారింది.

విషయం ఏమిటంటే మనదేశంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా లండన్లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. లండన్లో కూడా ఈయన గారు వ్యాపారం చేస్తున్నారు.  ఈయనకు చెందిన రోజ్ వెంచర్ క్యాపిటిల్ సంస్ధ మాల్యా కుటుంబానికి చెందిన ఒక భవనాన్ని కుదువపెట్టి యూబీఎస్ అనే సంస్థ నుంచి భారీగా అప్పు తీసుకుంది. కార్నివాల్ టెరాస్ అనే కాంపౌండ్ లో లక్షల పౌండ్లు విలువచేసే అపార్ట్ మెంటు ఉందట.

దీన్ని తనఖా పెట్టిన మాల్యా కుటుంబం తిరిగి అప్పు చెల్లించలేదు. దాంతో అప్పిచ్చిన సంస్ధ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన కోర్టు అప్పు చెల్లించాలని, లేదా అపార్ట్ మెంటును వదులుకోవాలని 2019లోనే  తీర్పు చెప్పింది.  అయితే కోర్టు తీర్పును మాల్యా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సదరు సంస్ధ తాజాగా కోర్టు ధిక్కారం కేసు వేసింది. దాంతో కోర్టుకు హాజరైన మాల్యా రుణాలు చెల్లించలేకపోవటానికి కరోనా వైరస్ అని అదని ఇదని కారణాలను చూప్పారు.

అయితే మాల్యా చెప్పిన కారణాల్లో దేన్ని కూడా నమ్మలేదు. అందుకనే వెంటనే అప్పు కింద అపార్ట్ మెంటును స్వాధీనం చేసుకోమని యూబీఎస్ సంస్ధకు అనుకూలంగా తీర్పుచెప్పింది. అంటే వెంటనే సదరు సంస్ధ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కూడా మొదలుపెట్టేసింది. ఇపుడా అపార్ట్ మెంటులో మాల్యా తల్లి లలిత ఉంటున్నారు. ఎవరున్నా తమకు అనవసరమని స్వాధీన చర్యలు మొదలుపెట్టేసింది సదరు సంస్ధ. భారత్ లో ఆడినట్లు ఎంత కాలమైనా ఆడచ్చని మాల్యా అనుకున్నట్లున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.