లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సంస్థల్లో ఒకటైన టెస్లా కంపెనీ ఇండియాలో కార్లెందుకు తయారు చేయలేదంటూ ఇటీవల ఓ నెటిజన్.. ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే.. అందుకాయన బదులిస్తూ భారత ప్రభుత్వంతో తమకు చాలా ఇబ్బందులు ఉన్నట్లుగా ట్వీట్ చేశారు. దానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను తెలంగాణకు పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రినని పేర్కొంటూ.. టెస్లా కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి తమ రాష్ట్రంలో ప్లాంటు పెట్టడానికి సహకరిస్తామంటూ ఒక ట్వీట్ వేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతలను కూడా వివరించారు. ఈ ట్వీట్ జాతీయ స్థాయిలో వైరల్ అయింది. కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ ప్రముఖులు తెలంగాణకు రావాలంటూ ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. వేరే సెలబ్రెటీలు కూడా వీళ్లను అనుసరించారు.
వీరిలో ఎక్కువమందిలో కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అని ఈ ట్వీట్లు వేసినట్లుందే తప్ప.. ఈ విషయం మీద పరిజ్ఞానం పెద్దగా లేదని అర్థమవుతోంది.అసలు టెస్లా ఇండియాలో అడుగు పెట్టకపోవడానికి కారణం వేరు. టెస్లా కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు పెట్టడానికి ఇష్టపడట్లేదు. పూర్తిగా తమ కార్లను విదేశాల్లోనే తయారు చేసుకుని ఇండియాకు వస్తామంటోంది. ఐతే ఇలా ఇంపోర్ట్ చేసే కార్లకు వంద శాతం పన్ను వేస్తోంది ప్రభుత్వం. ఇలా పన్ను వేయని పక్షంలో ఏ కంపెనీ కూడా ఇండియాలో తమ కార్లను తయారు చేయవు. ఇక్కడ ప్లాంట్లే పెట్టవు. ఇక్కడ పారిశ్రామికాభివృద్ధికి అది పెద్ద విఘాతం అవుతుంది.
దేశీయంగా కార్లు తయారు చేసే సంస్థలకు అది గొడ్డలి పెట్టే అవుతుంది. టెస్లా కంపెనీ ఇక్కడ ప్లాంటు పెట్టి కార్లను తయారు చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ విషయంలో గ్యారెంటీ ఇవ్వట్లేదు. విదేశాల నుంచి కార్లు తయారు చేసుకొచ్చి ఇక్కడ దింపుతామని, పన్ను మినహాయింపు ఇవ్వాలని అడుగుతోంది. ఇదీ అసలు సమస్య. దీని గురించి కేటీఆర్‌కు తెలియకుండా ఉండదు. అయినా ఆయన ఆ ట్వీట్ వేశారు. విషయం తెలియని సెలబ్రెటీలంతా ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి రీట్వీట్లు చేస్తూ మస్క్‌ను ట్యాగ్ చేసి వెల్కం టు తెలంగాణ అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on January 19, 2022 10:18 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…