అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. తిరుమల శ్రీవారిని ఆపాదమస్తకం దర్శించి తరించాలని.. ఎవరికి మాత్రం ఉండదు. అంతేకాదు.. ఆయనకు నిత్యం జరిగే అనేక సేవల్లో పాల్గొని జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకోరు. అయితే.. ఇప్పుడున్న సౌకర్యాల మేరకు.. ప్రతి సేవకు ఒక్కొక్క టికెట్ తీసుకోవాలి. అది కూడా ఒక్కో సేవకు ఒక్కొక్క సమయం. దీంతో అన్ని సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం.. సరికొత్త ఆలోచన చేసింది. స్వామికి జరిగి అన్ని సేవల్లోనూ భక్తులు ఏకకాలంలో పాల్గొనేలా టికెట్‌ను తీసుకురానుంది.
రూ. కోటితో ఒక టికెట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టికెట్‌తో ఉదయం శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవ నుంచి రాత్రికి నిర్వహించే.. పవళింపు సేవ వరకు.. భక్తులు అన్ని సేవల్లోనూ పాల్గొనే అవకాశం కల్పిస్తారు. అయితే.. ఇంత ఖరీదు పెట్టి సాధారణ భక్తులు సేవల్లో పాల్గొనే అవకాశం లేదన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. అయితే.. దీనిని పారిశ్రామిక వర్గాలను దృస్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు.. టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇది సక్సెస్ అయితే.. మున్ముందు.. భక్తుల విజ్ఞప్తిని బట్టి.. 50 లక్షలకు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక, ఈ టికెట్‌పై ఉదయం సుప్రభాత సేవతో మొదలు పెట్టి.. తోమాల సేవ, కొలువు, అష్టదళ పాద పద్మారాధన, స్వామివారి అభిషేకం, వస్త్రాలంకరణ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావై, సహస్ర దీపాలంకరణ సేవ.. చివరిగా ఏకాంత సేవ.. అలా అన్ని సేవల్లోనూ పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈనెల 23 నుంచి ఈ ఉదయాస్తమాన సేవ ట్రయల్ రన్ మొదలవుతుంది. జనవరి రెండోవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఉదయాస్తమాన సేవ టికెట్ ద్వారా.. కనీసం 600 కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయంగా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధులను టీటీడీ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం నిర్మిస్తున్న ఆలయాలకు వినియోగించనున్నారు. ఇప్పటికే బర్డ్(చిన్నారుల ఆసుపత్రి) ఆసుపత్రులను ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించాలని తిరుమల అధికారులు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనేనిధుల కోసం.. ఈ టికెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారని అంటున్నారు. మరి దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on December 19, 2021 2:09 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…