Trends

భార్య మాట రికార్డ్ చేసినా తప్పే!

భార్య అయితే మాత్రం.. సర్వాధికారాలు భర్తకు ఉంటాయన్న భావన మీలో ఉందా? అయితే.. మీరు తప్పులో కాలేసినట్లే. భార్య భర్తకు అత్యంత సన్నిహితురాలు కావొచ్చు. అంత మాత్రాన ఆమెకు హక్కులు ఉండవనుకోకూడదు. ఆమె కూడా ఒక మనిషే. పెళ్లి అనే బంధంతో.. ఆమెకు సంబంధించిన అన్ని హక్కులు భర్తకు సంక్రమించవన్న విషయంపై అవగాహన చాలా ముఖ్యం. ఈ విషయంపై అవగాహన లేని చాలామంది నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. చేతలకు వచ్చినట్లుగా చేస్తుంటారు. ఇలాంటి తప్పులు చేయకూడదన్న విషయాన్ని తాజాగా ఒక రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.

భార్యకు తెలీకుండా భర్త.. ఆమె మాటల్ని రికార్డు చేయటం నేరమేనని పేర్కొంది. ఆమె ప్రైవసీని దెబ్బ తీస్తున్నట్లుగా అభిప్రాయపడింది. పంజాబ్ – హర్యానా హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. భార్యకు తెలీకుండా ఆమెకు సంబంధించిన విషయాల మీద భర్త చేసే రహస్యమైన పనుల్ని తప్పుగా తేల్చింది. భార్యభర్తల విడాకుల కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కీలక వ్యాఖ్య చేశారు.

ఇంతకీ ఈ కేసేమిటి? ఏ నేపథ్యంలో హైకోర్టు ఇలాంటి వ్యాఖ్య చేసిందన్నది చూస్తే.. విడాకుల కేసులో తన భార్య ఫోన్ సంభాషణకు సంబందించి సీడీని కోర్టుకు సమర్పిస్తామని భర్త తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దొంగచాటుగా ఫోన్ సంభాషణల్ని రికార్డు చేయటం తప్పేనని స్పష్టం చేసింది. భార్యకు తెలీకుండా ఇలాంటి పనులు చేయటం ఆమె ప్రైవసీకి భంగం వాటిల్లేలా చేసిందని అభిప్రాయపడింది. భర్త సాక్ష్యంగా ఇస్తానన్న సీడీపై భార్య తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆమె అనుమతి లేకుండా రికార్డు చేసిన మాటల్ని.. సాక్ష్యంగా తీసుకోకూడదన్న భార్య తరఫు లాయర్ వాదనను కోర్టు సమర్థించింది. భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం సెల్ ఫోన్ లో రికార్డు చేసిన మాటల్ని సాక్ష్యంగా తీసుకోకూడదని వాదించారు. ఆమె మాటల్లో వాస్తవం ఉన్నా దాన్ని సాక్ష్యంగా తీసుకోకూడదని వాదించారు. ఇదిలా ఉంటే.. భర్త తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భార్య క్రూరంగా హింసించటం వల్లే తన క్లయింట్ రహస్యంగా ఆమె మాటల్ని రికార్డు చేసినట్లుగా పేర్కొన్నారు. అయినప్పటికీ.. ఆ వాదనను పరిగణలోకి తీసుకోని కోర్టు.. కిందికోర్టు ఇచ్చిన ఆదేశాల్ని కొట్టేసింది. సో.. భర్తలు.. భార్యకు సంబంధించిన ఫోన్ సంబాషణల్ని రహస్యంగా వినటం.. ఆమె కాల్స్ ను రికార్డు చేసే తీరును వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.

This post was last modified on December 14, 2021 9:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

11 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

13 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

14 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

15 hours ago