ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఒకరైన వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో ఆయన నివసించే ఇల్లు ఎంతలాఉంటుందో తెలిసిందే. అత్యంత విలాసవంతమైన ఆ ఇంటి గురించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వచ్చాయి. తాజాగా గుజరాత్ లోని జాంనగర్ లో మరో ఇంటిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
సువిశాలంగా ఉండనున్న ఈ ఇంటికి ఆకర్షనీయంగా ఉండేందుకు రెండు చెట్లను తాజాగా కొనుగోలు చేశారు. ఈ అలీవ్ చెట్ల అందమే వేరు. వీటిని స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా కడియంకు తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కడియం – వీరవరం రోడ్డులోని గౌతమీ నర్సరీ ప్రత్యేకత తెలిసిందే. దీని యజమాని మార్గాని వీరబాబు.. తన అభిరుచికి తగ్గట్లుగా పెద్ద ఎత్తున మొక్కలు.. చెట్లు.. వివిధ జాతుల్ని సేకరిస్తుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా.. దేశంలోనే అత్యంత అరుదైన మొక్కల్ని పెంచి అమ్ముతుంటారు.
ముకేశ్ అంబానీ లాంటి వ్యాపారవేత్త ఇంటికి అవసరమైన చెట్ల కోసం దేశ వ్యాప్తంగా గాలించి.. కడియం నుంచి రెండు ఆలీవ్ చెట్లనుఎంపిక చేశారు. ఇందుకోసం అంబానీకి చెందిన రిలయన్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా వచ్చి వీటిని ఎంపిక చేశారు. చూసినంతనే ఆకర్షణీయంగా ఉండటమతో పాటు.. సువిశాలమైన ఇంటి ప్రాంగణలోని వీటిని ఉంచాలే కానీ.. ఇంటికి కొత్త అందాన్ని తీసుకురావటం ఖాయం. ఇంతకీ.. ఈ రెండు చెట్ల ధర తెలిస్తే గుండె వేగంగాకొట్టుకోవటం ఖాయం.
ఈ అరుదైన చెట్టు ఒక్కొక్కటి రూ.25లక్షలుగా చెబుతున్నారు. అంటే.. రెండు చెట్లకు రూ.50 లక్షలు ఖర్చు చేశారన్న మాట. అంతేకాదు.. ఈ చెట్లను కడియం నుంచి గుజరాత్ కు తరలించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాలీని ఏర్పాటు చేశారు. ఇందుకయ్యే రవాణా ఛార్జీనే రూ.3.5లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. కొంత కాలం క్రితం స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా ఈ చెట్లను తీసుకొచ్చారు.
ఇందుకోసం ఓడలో ప్రత్యేక కంటైనర్ లో తీసుకొచ్చి.. గోదావరి మట్టి.. నీళ్లతో ప్రత్యేక విధానాల్ని అనుసరించి దీన్ని పెంచారు. ఎంతోకాలంగా పెంచిన చెట్లు తమను వదిలివెళ్లిపోతున్న వేళ.. కడియం నర్సరీలో పని చేసే కార్మికులు ఫోటోలు దిగారు. స్పెయిన్ నుంచి ఈ చెట్లను తీసుకురావటానికి చాలానే ఖర్చు అయినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అంబానీ లాంటి కుబేరులు ఉండే ఇంటికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చి చెట్లకు రూ.55 లక్షల ఖర్చు పెద్దదేం కాదనే చెప్పాలి.
This post was last modified on November 26, 2021 10:33 am
సందీప్ రెడ్డి వంగ సినిమాలకు, అనిల్ రావిపూడి తీసే చిత్రాలకు అస్సలు పొంతన ఉండదు. కానీ సందీప్ అంటే అనిల్కు…
ఈ రోజుల్లో ఆడియో క్యాసెట్లు, సీడీలు లేవు. వాటి అమ్మకాలూ లేవు. ఆడియో ఫంక్షన్లూ లేవు. అలాంటపుడు ఆడియోలకు ఏం…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది…
గాయనిగా పరిచయమై.. నటిగా మంచి స్థాయిని చేరుకున్న తమిళ అమ్మాయి.. ఆండ్రియా. పెక్యులర్ వాయిస్తో ఆమె పాడిన కొన్ని పాటలు…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…