అత్యుత్తమ స్థానాలకు చేరుకోవటం ఎంత కష్టమో దాన్ని నిలుపుకోవటం అంతే కష్టం. ఎంతో శ్రమించి చేరుకున్న స్థానాన్ని చేజేతురాలా చెడగొట్టుకునే ఉదంతానికి నిదర్శనంగా నిలుస్తారు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టిమ్ పైన్. ‘సెక్ట్సింగ్’ స్కాండల్ ఆరోపణలు అతడు తన కెప్టెన్సీని వదులుకున్నారు. సంచలన ఆరోపణలు వెలుగు చూసిన అనంతరం.. తానుకెప్టెన్ గా కొనసాగలేనని పేర్కొంటూ కీలక పదవిని వదిలేశారు.
2018లో ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు కెప్టెన్ గా ఎంపికైన నాటి నుంచి ఇప్పటివరకు 46 టెస్టు మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించారు. తన సహోద్యోగి అయిన ఒక మహిళకు అసభ్యకర మెసేజ్ లు పంపి.. అడ్డంగా బుక్ అయ్యారు. 36 ఏళ్ల వయసున్న టిమ్.. తాజాగా తాను తీసుకున్న నిర్ణయాన్ని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు.
చాలా కఠిన నిర్ణయమే అయినా.. తన కుటుంబానికి.. జట్టుకు మాత్రం సరైన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ఆరోపణలపై తన భార్య.. కుటుంబ సభ్యులతో మాట్లాడానని.. వారి క్షమాపణ.. మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జట్టు కెప్టెన్ గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. జట్టు సభ్యుడిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించటం తనకు లక్ గా చెప్పుకున్న పైన్.. ఒక అమ్మాయి పంపిన బూతు మెసేజ్ ల కారణంగా కీలక పదవిని పోగొట్టుకున్నాడు.
ఇకపై తాను పూర్తిగా ఆట మీదనే ఫోకస్ చేస్తానని.. తాజా ఘటన తన ఆట ప్రతిష్టకు భంగం కలిగించినందుకు తనను క్షమించాలని కోరాడు. తాను కెప్టెన్ బాద్యత నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పాడుమ ఇంగ్లండ్ జట్టుతో కీలకమైన యాషెస్ సీరిస్ కు ముందు జట్టు కెప్టెన్ గా పైన్ వైదొలగటం ఇబ్బందికర పరిస్థితిగా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates