ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి పనిగంటల విషయంలో ఐస్ ల్యాండ్ ప్రపంచదేశాలకు కొత్త మోడల్ గా అవతరించబోతోందా ? మానసిక శాస్త్రవేత్తలు, నిపుణుల లెక్కల ప్రకారం అవుననే సమాధానం వినబడుతోంది. పనిగంటలు తగ్గించటం, పనిదినాల్లో మార్పులు చేసే విషయంలో ఐస్ ల్యాండ్ లో నాలుగేళ్ల పాటు జరిగిన ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో ఐస్ ల్యాండ్ లో జరిగిన ప్రయోగాలను తెలుసుకునే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగులకు, కార్మికులకు పని విషయమై బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగులైనా, కార్మికులైనా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ నిబంధనలను కచ్చితంగా పాటేంచే దేశాలు, యాజమాన్యాలు ఎన్నున్నాయంటే సరైన సమాధానం దొరకదు. అందుకనే ఇదే విషయమై ఐస్ ల్యాండ్ లో 2015-2019 మధ్య ఓ అధ్యయనం జరిగింది. వివిధ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు, అనేక కంపెనీల్లో పనిచేసే కార్మికులను రకరకాలుగా వర్గీకరించారు.
మొత్తం 2500 మందిని ఎంపిక చేసి ఐస్ ల్యాండ్ ప్రయోగాలు చేసింది. దీని సారాంశం ఏమిటంటే ఇతర ఉద్యోగులు, కార్మికులకంటే పనిగంటలు తగ్గిన ఉద్యోగులు, కార్మికులు అలాగే పనిదినాలు తగ్గిన కార్మికులు, ఉద్యోగుల్లో పనిచేసే సామర్ధ్యం బాగా పెరిగిందట. మామూలుగా అయితే కార్మికులైనా, ఉద్యోగులైనా వారానికి 44.4 గంటలు పనిచేయాల్సిందేనట ఐస్ ల్యాండ్ లో కూడా. అయితే ఎంపిక చేసుకున్న ఉద్యోగులు, కార్మికుల పని గంటలను 36-40 గంటలు తగ్గించేశారట.
ఈ అధ్యయనంలో ఎంపిక చేసిన వారిలో పనిచేసే సామర్థ్యం అంతకుముందు కన్నా బాగా పెరిగినట్లు తేలింది. మామూలుగా అయితే ఉదయం ఉద్యోగులు, కార్మికులు పని మొదలు పెట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహం సాయంత్రానికి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగులు, కార్మికుల్లో ఉదయం వచ్చినపుడున్న ఉత్సాహమే సాయంత్రం పని ముగించే సమయంలో కూడా ఉందని తేలింది. కారణం ఏమిటంటే పనిగంటలు తగ్గటంతో పాటు వారానికి 4 రోజులే పనిచేయటం.
అంటే అంతకు ముందు 8 గంటల్లో చేసిన పనినే ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులు, కార్మికులు ఆరు గంటల్లోనే పూర్తి చేశారు. అలాగే వారానికి ఐదురోజుల పనిదినాలకు బదులు 4 రోజులే పని చేయించుకోవటం పని సామర్ధ్యం పెరగడానికి కారణమైందట. దీంతో కొత్త ప్రయోగాన్నే ఐస్ ల్యాండ్ లో అమలు చేయటానికి అక్కడి ప్రభుత్వం రెడీ అయిపోతోంది. మరి ఇదే ఫార్ములాను తొందరలో ఎన్ని దేశాలు ఫాలో అవుతాయో చూడాలి.
This post was last modified on October 20, 2021 5:36 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…