‘నీ ఇల్లు బంగారం కాను’ అన్న సామెత సంగతేమో కానీ.. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండాలే కానీ.. ఇంటిని బంగారంలా మార్చేస్తున్న వైనం ఎక్కువైంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో ఈ ట్రెండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయటం ఒక ఎత్తు. వాటికి అందుకు తగ్గట్లు ముస్తాబు చేయటం మరో ఎత్తు. ప్రధాన ద్వారం మొదలుకొని.. కార్పెట్లు.. కర్టెన్లు.. వాల్ పేపర్స్.. లైట్లు..సీలింగ్.. ఫర్నీచర్ మొత్తం బంగారు వర్ణంలో తళుకులీనేలా సిద్ధం చేయటం ఎక్కువైంది.
ఇందుకోసం విదేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్ ను దిగుమతి చేసుకొని ఇంటిని బంగారం చేసుకోవడం ఈ మధ్యన కొత్త ట్రెండ్ గా మారింది. 24 క్యారెట్ గోల్డ్ లీఫింగ్ తో ఇంటికి కొత్త నగిషీలు చెక్కుతున్నారు. ఇందుకోసం టర్కీ.. ఇటలీ దేశాల నుంచి నిపుణులు వచ్చి మరీ.. ఇంటిని యజమానుల అభిరుచి మేరకు సరికొత్త హంగులు సమకూరుస్తున్నారు.
దీంతో రాజభవనాలను తలపించేలా ఇళ్లు తయారవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో విలాసవంతమైన లగ్జరీ విల్లాలు.. అపార్ట్ మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ లను సైతం భారీగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా 24 క్యారెట్ల గోల్డ్ లీఫింగ్ తో ఇంటీరియర్ చేయిస్తున్న వైనం ఎక్కువైంది. ఈ తరహా ఇంటీరియర్స్ ను సిద్ధం చేయటం కోసం విదేశాల నుంచి ఇంటీరియర్ నిపుణుల్ని తీసుకొస్తున్నారు. అయితే.. వీరు చిన్నా చితకా పనుల కోసం రారు.
కనీసం 10 వేల చదరపు అడుగులు.. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటీరియర్ చేయాలంటేనే వస్తున్నారు. ఖర్చు కోసం చదరపు అడుగుకు కనీసం రూ.800 నుంచి రూ.4500 వరకు ఉంటుందని.. ప్రాజెక్టు మొత్తం పూర్తి కావటానికి కనీసం రూ.5 నుంచి రూ10 కోట్ల మధ్య ఖర్చు అవుతుందని చెబుతున్నారు.ఈ బంగారు ఇంటీరియర్ కోసం కనీసం నెల నుంచి మూడు నెలల సమయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ సంపన్నుల్ని విపరీతంగా ఆకర్షిస్తోందని చెబుతున్నారు.
This post was last modified on October 15, 2021 11:18 am
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…