కలం కనే కలలు…

వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతీ యువకులు కలిసి తెలుగు మీద ఉన్న అభిమానం తో ఒక కవిత సంకలనం రచించారు. దీనికి వారి వాట్సప్ గ్రూప్ అయిన “కలం కనే కలలు” అని పేరు పెట్టారు.

ఈ కవితా సంకలనం లో 42 మంది కలిసి వివిధ అంశాలను ఎంచుకుని కవితలు, కథల రూపంలో రాయడం జరిగింది. కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా దీనిని విడుదల చేశారు.

ఈ యువ రచయితలంతా మనిషి జీవిత అనుభవాలను, రైతుల కష్టాలను, ప్రేమానుబంధాలను, సమాజ స్థితిగతులను , అణువణువున చవి చూస్తున్న అన్యాయాలను మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని వారి కలంతో గళం విప్పారు.

ఈ వాట్సప్ గ్రూప్ కి కారణమైన హేమంత్ అనే కుర్రాడి ఆకస్మిక మరణంతో ఈ పుస్తకం తనకు అంకితం చేశారు ఆ గ్రూప్ కి చెందిన యువతీ యువకులు.

ఈ పుస్తకం ఆన్లైన్ లో కొనుగోలు చేయాలి అంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేయవచ్చు.

https://orangebooks.in/product/kalam-kane-kalalu/