అంతర్జాతీయ క్రికెట్లోకి చాలామంది వస్తారు. వెళ్తారు. కానీ తాము వెళ్లిపోయాక కూడా తమను కొన్ని తరాలు గుర్తుంచుకునే గొప్ప ప్రదర్శన చేసే ఆటగాళ్లు కొందరే ఉంటారు. అలాంటి అతి కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన డేల్ స్టెయిన్.. క్రికెట్ మైదానానికి టాటా చెప్పేశాడు. 38 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఫాస్ట్ బౌలర్లలో స్టెయిన్ ఒకడనడంలో సందేహం లేదు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించడం అతడికే చెల్లింది. సచిన్ టెండుల్కర్ సహా ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో చాలామంది స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డవాళ్లే. విపరీతమైన వేగానికి తోడు స్వింగ్‌తో అతను బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు. ముఖ్యంగా అతడి యార్కర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫాస్ట్ పిచ్‌లపై నిప్పులు చెరిగే స్టెయిన్.. ఫ్లాట్ పిచ్‌లపైనా అదరగొట్టిన సందర్భాలు బోలెడు.
ప్రపంచ క్రికెట్లో మరే బౌలర్‌కూ సాధ్యం కాని విధంగా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 2343 రోజుల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగిన అరుదైన బౌలర్ డేల్ స్టెయిన్. రెండు మూడేళ్ల ముందు వరకు స్టెయిన్ తన బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఐతే వయసు ప్రభావం, గాయాలు స్టెయిన్ ప్రదర్శన పై ప్రభావం చూపాయి. గత రెండు మూడేళ్లలో ఆడిన మ్యాచ్‌లు తక్కువ. వాటిలోనూ అంతగా రాణించలేదు.
ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున అద్భుత ప్రదర్శనతో భారత అభిమానుల మనసులు దోచాడు స్టెయిన్. అతడి మెరుపు ప్రదర్శనలను అంత సులువుగా మరిచిపోలేరు మన అభిమానులు. ఐతే ఐపీఎల్ ద్వారా అంతగా ఆదరణ సంపాదించుకున్న స్టెయిన్.. కెరీర్ చరమాంకంలో ఈ లీగ్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశాడు. ఈ లీగ్‌లో డబ్బు గురించే ఎప్పుడూ చర్చ అని.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆట మేదే ఫోకస్ పెట్టగలమని ఆ లీగ్‌కు ఆడుతూ కొన్ని నెలల కిందట స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
భారత అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాక తన వ్యాఖ్యల పట్ల అతను విచారం వ్యక్తం చేశాడు. 16 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో స్టెయిన్ 93 టెస్టుల్లో 439 వికెట్లు, 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు.
This post was last modified on September 1, 2021 11:57 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…