దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలు.. అన్నింతా తామై ముందుకు వెళుతున్నారు. అంతెందుకు.. మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో సైతం.. అమ్మాయిలే ఎక్కువ పతకాలు గెలవడం గమనార్హం. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నా.. ఇంకా వారిపై చిన్నచూపు చూసేవారు లేకపోలేదు.. ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టకూడదని తన భార్యకు ఏకంగా 8 సార్లు అబార్షన్ చేయించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయికి చెందిన ఓ యువతికి 2007లో వివాహమైంది. ఆమెను బాగా సంపన్న కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. పెళ్లైన కొంతకాలానికే ఆమెకు వేధింపులు మొదలుకావడం గమనార్హం. 2009లో ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ ఆమెకు అబార్షన్ చేయించాడు.
ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్థారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్ తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఆమెకు దాదాపు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. చికిత్స, ఆయా పరీక్ష సమయంలో ఆమెకు 1500 పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు.
ఇన్ని చేస్తున్నా మౌనంగా భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సభ్య సమాజం భగ్గుమంటోంది. కొడుకు కోసం ఇంతటి దారుణాలకు పాల్పడమేంటని అంతా మండి పడుతున్నారు.
This post was last modified on August 18, 2021 12:47 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…