ఆప్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న క్రికెటర్ రషీద్ కుటుంబం..!

ఆప్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. మొత్తం దేశం తాలిబన్ల హస్తగతమైంది. దీంతో.. ఆ దేశ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా.. ఈ ప్రమాదంలో తన కుటుంబం కూడా ఇరుక్కుపోయిందంటూ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కొద్ది రోజుల క్రితమే.. రషీద్ ఖాన్.. తన దేశం ప్రమాదంలో ఉందని.. రక్షించడండి అంటూ ప్రపంచ దేశాలను కోరాడు. ఆయన ట్వీట్ చేసిన ఐదు రోజులకే తాలిబన్లు అఫ్గాన్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తమ హస్తగతం చేసుకునేందుకు ఎలాంటి దాడులు చేయడం లేదని, శాంతియుతంగా అధికారం హస్తగతం చేయాలని ఆ ముష్కరులు సూచించారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సైతం విదేశాలకు పారిపోయాడు.

రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ లో ఏముందంటే..
తాను ఇంగ్లాండ్‌లో ఉన్నానని, కానీ తన దేశం ఆపదలో ఉందని.. సామాన్య ప్రజలు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా తన కుటుంబం గురించి అఫ్గాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ అధికంగా ఆందోళన చెందుతున్నాడు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకోగా, తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉందని రషీద్ బాధపడుతున్నాడు. రషీద్ ఖాన్‌తో పాటు మహ్మద్ నబీ సైతం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నారు. హండ్రెడ్ లీగ్‌లో భాగంగా రషీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్‌కు, లండన్ స్పింట్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెటర్లు విదేశాలలో ఉన్నా, తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నానని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో తన బాధను షేర్ చేసుకున్నాడు. తన కుటుంబం, దేశం గురించి ఆందోళన చెందుతున్న రషీద్ ఖాన్ ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు.