మన దేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్.. మరే క్రీడకూ లేదనే చెప్పాలి. టీవీలో మ్యాచ్ వస్తోందంటే చాలు.. చిన్నా. పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఐపీఎల్ అంటే.. మరింత ఎక్కువ క్రేజ్ ఉంటుందనే చెప్పాలి. అయితే.. ఇంత క్రేజ్ ఉన్నా.. ఇప్పటి వరకు.. క్రికెట్ కి ఒలంపిక్స్ లో చోటు దక్కలేదు. కానీ.. తాజాగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ తీపి కబురు చెప్పింది. ఒలంపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ ను చేర్చాలని తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతిపాదనలు పంపింది.
దీనికోసం ప్రత్యేకంగా బిడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2028 సంవత్సరంలో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ ప్రకటించేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 శాతం క్రికెట్ మ్యాచ్లకు అభిమానులు ఉన్నారని పేర్కొన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…. ఒలంపిక్స్లో ఎలాగైనా క్రికెట్ ను అమలు చేయాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్న క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చితే…. చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఐసీసీ.
This post was last modified on August 11, 2021 10:06 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…