టోక్యో ఒలంపిక్స్ లో ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్ కియోన్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే ఒలింపిక్స్‌లో 7 మెడల్స్ గెలిచిన తొలి ఫిమేల్ స్విమ్మర్‌గా ఆమె నిలిచింది.
ఆదివారం జరిగిన మహిళల 4×100 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా మెక్‌కియోన్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఆమెతోపాటు కేలీ మెక్‌కియోన్, చెల్సీ హాడ్జెస్, కేట్ క్యాంప్‌బెల్‌లతో కూడిన ఆస్ట్రేలియా టీమ్ రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ అమెరికాకు షాకిచ్చింది.
ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో మెక్‌కియోన్ మొత్తం మెడల్స్ సంఖ్య ఏడుకి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లో ఇన్ని మెడల్స్ గెలిచిన మరో మహిళా స్విమ్మర్ లేకపోవడం విశేషం. 27 ఏళ్ల మెక్‌కియోన్ నాలుగు గోల్డ్ మెడల్స్, మూడు బ్రాంజ్ మెడల్స్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పటివరకూ ఈస్ట్ జర్మనీకి చెందిన క్రిస్టిన్ ఒటో (1952లో 6 మెడల్స్), అమెరికాకు చెందిన నటాలీ కఫ్లిన్ (2008 ఒలింపిక్స్) పేరిట ఉన్న రికార్డును మెక్‌కియోన్ చెరిపేసింది.
This post was last modified on August 2, 2021 10:31 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…