సమాజంలో చెడుధోరణలు పెరిగిపోవటానికి పోర్న్ సైట్లు కూడా కీలకంగా మారుతోందా ? అవుననే అర్ధమవుతోంది తాజాగా బయటపడిన ఓ సర్వే నివేదిక ద్వారా. స్మార్ట్ ఫోన్లు కలిగిన వారిలో దాదాపు 89 శాతం పోర్న్ సైట్లు రెగ్యులర్ గా చూస్తున్నట్లు సర్వేలో తేలింది. దేశంలోని ఒక్కో స్మార్ట్ ఫోన్ సగటున నెలకు 9.5 గీగా బైట్స్ ఉపయోగిస్తుంటే అందులో మూడొంతుల డేటా కేవలం పోర్న్ చూడటానికే ఉపయోగిస్తున్నారని ఓ పోర్న్ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 18-24 వయసుల మధ్య ఉన్న 44 శాతం మంది పోర్న్ ను చూస్తున్నారు. 25-34 వయసుల మధ్యున్న వారు 41 శాతంమంది చూస్తున్నారు. 35-44 వయసున్న వారు 6 శాతం, 45-54 వయసు మధ్యున్న వారు 4 శాతం పోర్న్ చూస్తున్నట్లు తేలింది. ఈ సర్వే మొత్తం పోర్న్ వెబ్ సైట్ చేసిన సర్వేలో బయటపడటమే విడ్డూరం.
ప్రతిరోజు పోర్న్ వెబ్ సైట్లు చూస్తున్నవారిలో మానసిక పరిస్ధితులపై తీవ్రమైన మార్పులు వస్తున్నట్లు వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇంటర్నెట్ ప్రొవైడర్ల మధ్య పోటీ పెరిగిపోవటం, శాటిలైట్ టెక్నాలజీ పెరిగిపోవటం, వ్యాపారంలో తీవ్రమైన పోటీ కారణంగా ఇంటర్నెట్ జనాలకు చాలా చవకగా దొరుకుతోంది. అందులోను స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేయటంతో యువత, మధ్య వయసుల వారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.
నీలిచిత్రాల్లో విశృంఖలమైన శృంగారాన్ని చూపుతుండటం వల్ల వాటిని పదే పదే చూస్తున్న యువత ఆడవాళ్ళు, చిన్నపిల్లలను సెక్స్ కోర్కులు తీర్చే వస్తువుగా మాత్రమే చూస్తున్నట్లు తేలింది. వీరిలో వస్తున్న మానసిక ప్రవర్తనతో ఇంట్లో పెద్దవాళ్ళతో తరచు గొడవలు పెట్టుకోవటం, ఒంటరి మహిళలు ఎక్కడ దొరుకుతారా అని చూడటం లాంటి విపరీతమైన మనస్ధితికి లొంగిపోతున్నారట. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బ్లూఫిల్ముల నిర్మాణం వ్యవహారం వెలుగు చూసిన నేపధ్యంలో పోర్న్ పై దేశంలో మళ్ళీ చర్చలు ఊపందుకుంది.
ఒకపుడు నీలిచిత్రాలను ఎవరైనా చూడాలంటే జనాలు చాలా కష్టపడాల్సొచ్చేది. వీడియో పార్లర్లకు వెళ్ళి దొంగతనంగా క్యాసెట్లను తెచ్చుకునేవారు. అదికూడా ఎవరికి పడితే వారికి దొరికేవికావు. ఎంతో నమ్మకమైన కస్టమర్లకు మాత్రమే పార్లర్ల ఓనర్లు ఇచ్చేవారు. కానీ స్మార్ట్ ఫోన్లు, చవక ఇంటర్నెట్ పుణ్యమాని అరచేతిలోనే అన్నింటినీ చూసేయగలుగుతున్నారు యువత.
దానికి తోడు మనదేశపు చట్టాల ప్రకారం పోర్న్ చూడటం తప్పుకాదు. కానీ పోర్న్ వీడియోలను షేర్ చేయటం, పోర్న్ సినిమాలను తీయటం, మహిళలకు తెలీకుండా ఫోటోలు, వీడియోలు తీయటం నేరం. చూడటం నేరం కాదుకాబట్టే విదేశాలకు చెందిన పోర్న్ మూవీస్ ను చాలా ఈజీగా చూసేస్తున్నారు. ఇలాంటివే మన సమాజం కొంపముంచేస్తోంది. జరుగుతున్న నేరాల్లో పోర్న్ ఆధారమైన నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దాంతో ఏమి చేయాలో ఎవరికీ అర్ధం కావటంలేదు.
This post was last modified on August 1, 2021 6:36 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…