కరోనా మహమ్మారి మన దేశంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ మధ్యకాలంలో కరోనా కేసులు కాస్త తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ పెరగడం మొదలైంది. తాజాగా.. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కాగా.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యంత ప్రమాదకారిగా హెచ్చరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించిన కేసులు నమోదవ్వడం గమనార్హం.
ఈ డెల్టా ప్లస్ కేసులు ఈ నెల 23 నాటికి తెలంగాణలో రెండు నమోదైన్టుల కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో డెల్టా ప్లస్ ఉనికి ఉందని స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 70 డెల్టా ప్లస్ కేసులు గుర్తించారు. కరోనా వైరస్ ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా మారింది. రెండో దశలో దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ బీభత్సం సృష్టించింది. ఇప్పుడు ఆ డెల్టా రకం మరికొన్ని మార్పులలో డెల్టా ప్లస్ గా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్ లో 11, తమిళనాడులో 10 డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,44,330 గా నమోదైంది. కరోనా చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 3,800కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
This post was last modified on July 31, 2021 10:48 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…