ప్రస్తుతం ఎక్కడ చూసినా.. టోక్యో ఒలంపిక్స్ పేరే వినపడుతోంది. ఏ దేశం ఎక్కువ పతకాలు గెలుస్తుంది.. ఎవరెవరికు దేశానికి పతకాలతో తిరిగివస్తారంటూ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ టోక్యో ఒలంపిక్స్ లో ఆటతోపాటు.. చాలా విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
మొన్నటికి మొన్న ఓ కోచ్.. అథ్లెట్ కి ప్రపోజ్ చేయడం వైరల్ గా మారితే.. నిన్న.. ఓ కోచ్.. ఆటకి ముందు ప్లేయర్ చెంప పగలకొట్టడం విమర్శలకు దారితీసింది. తాజాగా.. ఓ క్రీడాకారిణి తన ఆట కోసం.. ఆటలో గెలవడం కోసం కండోమ్ వాడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం గమనార్హం.
ఈ ఒలంపిక్స్ లో అధికారులు అథ్లెట్స్ కి కండోమ్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే . అయితే.. వాటిని సెక్స్ కోసం వినియోగించవద్దని.. కావాలంటే మీ దేశం తీసుకువెళ్లండి అంటూ.. అధికారులు క్రీడాకారులకు చెప్పారు.
కాగా.. ఆ కండోమ్ ఉపయోగించుకొని.. ఓ క్రీడాకారిణి పతకం గెలిచింది. నమ్మకసక్యంగా లేకపోయినా ఇది నిజం. కండోమ్ లేకపోయి ఉంటే.. ఆమె ఓడిపోయేది. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. కండోమ్ ని వినియోగించింది. ఫలితంగా విజయం సాధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియాకు చెందిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(27) కండోమ్ వాడి బ్రాంజ్(కాంస్యం) మెడల్ గెలిచింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది.
జెస్సికా ఫాక్స్ తను ఎదుర్కొన్న సమస్యకు కండోమ్ సాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని తన కోచ్ పిండి పదార్ధం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. అలా పడవకు రిపేర్ చేసి రేస్ ముగించింది. ఈ సీక్రెట్ ను తాజాగా ఆమే సోషల్ మీడియాలో రివీల్ చేసింది. ఆమె సమయస్ఫూర్తి చూసి.. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on July 30, 2021 1:55 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…