ప్రభుత్వ ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకునే సదుపాయం ఉంది. వాళ్లకు ఉద్యోగం చేయడం కుదరని సమయంలో.. స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందుతారు. ఇప్పటి వరకు ఇలా పదవీ విరమణ పొందినవారిని మీరు చాలా మందే చూసి ఉంటారు. అయితే.. తాజాగా ఓ మహిళా ఐపీఎస్ వీర్ఎస్ తీసుకోగా.. అలా తీసుకోవడానికి గల కారణం విని అందరూ షాకయ్యారు. హర్యానకు చెందిన ఈ మహిళా అధికారిణి.. ఇన్నాళ్లు ప్రజాసేవలో ఉన్నాను.. ఇకపై దేవుడి సేవ చేసుకుంటానని వీఆర్ఎస్ కు అప్లై చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఐజీ స్థాయి పోస్టులో ఉన్న భారతి అరోరా భగవాన్ శ్రీకృష్ణుడి సేవకు అంకితమయ్యేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారు. 1998 బ్యాచ్ కు చెందిన భారతి… ప్రస్తుతం అంబాలా రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి దరఖాస్తు పంపారామె. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నానని… భగవంతుని సాక్షాత్కారం కోసం పని చేస్తానని వివరించారు.
ఎందరో సాధువులు చూపిన మార్గంలో ఇకపై నడవాలని కోరుకుంటున్నానని అన్నారు భారతి అరోరా. శ్రీకృష్ణుడి సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని దరఖాస్తులో వివరించారు. వీఆర్ఎస్ కోరుతూ ఆమె చేసుకున్న దరఖాస్తును హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ వద్దకు చేరింది. 2009లో ఈయన అంబాలా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన్ను అరెస్ట్ చేయాలని భారతి ఆదేశించారు. ఇప్పుడు అదే అనిల్ విజ్ దగ్గరకు ఆమె ఫైల్ చేరడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates