మరో టీమిండియా క్రికెటర్ కి కరోనా.. మ్యాచ్ వాయిదా

మరో టీమిండియా క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవల రిషబ్ పంత్ కి కరోనా పాజిటివ్ రాగా.. హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందాడు. తాజాగా.. కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. శ్రీలంకతో జరుగుతున్న టీ20 వాయిదా పడింది.

ఈ రోజు రాత్రి 8గంటలకు శ్రీలంకతో టీమిండియా టీ20 మ్యాచ్ జరగాల్సి ఉండగా… టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇవాళ జరిగే టి20 మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. అంతేకాదు.. రెండు జట్ల ప్లేయర్లలో అందరికీ కరోనా నెగిటివ్ వస్తేనే బుధవారం రోజున మ్యాచ్ తిరిగి ప్రారంభిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇక కృనాల్ పాండ్యా కు కరోనా సోకడంతో ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లారు.