భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి అతను అర్ధంతరంగా తప్పుకుని ఇంటికి వచ్చేయడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్ నుంచి అలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. చివరికి ఆ వివాదాన్ని అందరూ మరిచిపోయారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను మళ్లీ చెన్నైకి ఆడాడు.
కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడు ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రైనా.. అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. సహచర కామెంటేటర్ ఒకరు ఓ ప్రశ్న అడిగాడు. ధోతీ ధరిస్తూ.. విజిలేస్తూ.. డ్యాన్స్ చేస్తూ చెన్నై సంస్కృతిలో ఎలా కలిసిపోయావు అని రైనాను ప్రశ్నించాడు.
దీనికి రైనా బదులిస్తూ.. ‘‘నేను కూడా బ్రాహ్మణుడినే అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. నేను నా సహచరులను.. ఇక్కడి సంస్కృతిని బాగా ఇష్టపడతాను’’ అన్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. చెన్నై అంటే బ్రాహ్మణులు తప్ప ఇంకెవరూ ఉండరా.. బ్రాహ్మణులు మాత్రమే ధోతీ కడతారా.. సంప్రదాయబద్ధంగా ఉంటారా.. చెన్నైకి ఆడుతూ ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకున్నది ఇదేనా అంటూ రైనా మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
అవసరం లేని చోట కులం గురించి మాట్లాడి.. తాను బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడం ఎందుకని రైనాను ఇంకొందరు నిలదీశారు. మొత్తానికి రైనా ఏదో యధాలాపంగా చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. అతణ్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు వేశారు. ఐతే రైనాను ఇలా ఎటాక్ చేయడం చూసి అతడి అభిమానులు.. #Isupportsureshraina అంటూ మరో హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడి మద్దతుగా ట్వీట్లు వేశారు.
This post was last modified on July 23, 2021 12:28 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…