#tamilsrejectramrajproducts.. బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన బట్టల దుకాణాల్లో రామ్ రాజ్ కాటన్స్ ఒకటి. అది మొదలైంది తమిళనాడులో. తర్వాత కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లోనూ విస్తరించింది. ఉత్తరాదిన కూడా అక్కడక్కడా స్టోర్లు ఉన్నాయి. మరి రామ్ రాజ్ ఉత్పత్తులను స్వయంగా తమిళులే బాయ్‌కాట్ చేయడం ఏంటి అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం.
ఆ సంస్థ ఉద్యోగాల కోసం ఇచ్చిన ఒక ప్రకటనే తమిళ జనాల ఆగ్రహానికి కారణం. తమిళనాడులోని మధురై, తిరుప్పూరు ప్రాంతాల్లో తమ సంస్థలో ఉన్న ఖాళీలకు రామ్ రాజ్ కాటన్ వాళ్లు ఇచ్చిన ప్రకటనలో.. ఐటీ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల అర్హతల్లో ‘తెలుగువారికి ప్రాధాన్యం’ అని పేర్కొన్నారు. అది తమిళ జనాలకు రుచించలేదు.
తమిళనాడులో తమిళ సంస్థలో ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి.. తెలుగు వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం పట్ల తమిళ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై సహా కొన్ని సిటీల్లో తెలుగు వారు చాలా ఉద్యోగాలు దక్కించుకున్నారని.. అలాంటిది ఇప్పుడు ఓ తమిళ సంస్థ ఏరికోరి తెలుగు వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటన్నది తమిళ జనాల అభ్యంతరం. అందుకే రామ్ రాజ్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తూ ట్విట్టర్లో ట్రెండ్ మొదలుపెట్టేశారు. ఇకపై రామ్ రాజ్ ఉత్పత్తులేమీ వాడమంటూ తమిళ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు.
ఇలా ప్రకటన ఇచ్చినందుకు రామ్ రాజ్ కాటన్ యాజమాన్యం క్షమాపణ చెప్పి, సదరు ఉద్యోగాలను తమిళులకే ఇవ్వాలని.. లేదంటే ఇకపై రామ్ రాజ్ ఉత్పత్తులే కొనమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో తమిళ జనాల పట్టుదల ఎలా ఉంటుందో తెలిసిందే కాబట్టి వారి డిమాండ్లకు రామ్ రాజ్ కాటన్స్ తలొగ్గక తప్పదేమో.
This post was last modified on July 22, 2021 10:43 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…