ఇప్పటికే కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ప్రపంచానికి.. ఇప్పుడు చైనా.. మరో వైరస్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజం. కరోనా పుట్టిన దేశంలో ఇప్పుడు మరో అత్యంత ప్రమాదకరమైన వైరస్ వెలుగు చూసింది.
ఇప్పటికే కరోనా వైరస్‌కు మందు కనుగొనలేదు. ఇది తనను తాను ప్రభావ శీలం చేసుకుంటూ.. ప్రజల ప్రాణాలు హరిస్తున్న విషయం తెలసిందే. డెల్టా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ అనేక దేశాలను లాక్‌డౌన్ దిశగా నడిపిస్తోంది. మరోవైపు.. వ్యాక్సిన్లకు కూడా అందని కరోనా రూపాంతరం.. తెరమీదికి వచ్చి.. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు.
ఇలాంటి తరుణంగా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మరో కొత్త వైరస్ చైనాలో బయటపడింది. ‘మంకీ బీ’గా పిలిచే ఈ కొత్త వైరస్‌తో చైనాలో ఓ శాస్త్రవేత్త మరణించడం కలకలం రేపుతోంది. కోతులపై పరిశోధనలు చేసే పశువైద్య నిపుణులు ఒకరు మంకీ బీ బారిన పడి మరణించారు.
మంకీ బీ వైరస్ బయటపడేందుకు 1 నుంచి 3 వారాల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంకీ బీ వైరస్ సోకితే ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని గుర్తించారు. వైరస్ సోకితే 70 నుంచి 80 శాతం మంది మరణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కోతుల ద్వారా వ్యాపించే ఈవైరస్ అత్యంత ప్రమాదకరమని.. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇది కోతులకు ఎలా వచ్చిందనే అంతుచిక్కకపోవడం గమనార్హం. మంకీ బీ వైరస్ సోకిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, విపరీతమైన అలసట వచ్చే ప్రమాదం ఉంది.
అంతేకాదు.. వాంతులు చేసుకోవడంతోపాటు.. వైరస్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. వంటిపై బొబ్బలు రావడం.. శరీరం.. ముడుచుకుపోవడం.. వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ వైరస్ నుంచి రక్షించుకునే మందులు కూడా లేకపోవడం గమనార్హం. అయితే.. ఇది కరోనా మాదిరిగా అంటువ్యాధా.. కాదా.. అనేది త్వరలోనే తేలుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.