Trends

ఇండియా విన్.. ఆయనకు బ్యాండ్


అర్జున రణతుంగ.. శ్రీలంకకు వన్డే ప్రపంచకప్ అందించి సంచలనం సృష్టించిన సారథి. ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిపోయిన రణతుంగ.. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేశాడు. రాజకీయ నేతగా మారినప్పటికీ రణతుంగ క్రికెట్ వ్యవహారాల గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఇండియా అంటే మహా మంట. ఐపీఎల్‌‌ను చూసి అసూయ చెందుతూ దాని మీద చాలాసార్లు విమర్శలు గుప్పించాడు.

ఇటీవల ఆయన చేసిన ఒక కామెంట్ దుమారం రేపింది. కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. దేశంలో ఇంకా ఎంతోమంది వన్డే, టీ20 స్పెషలిస్టులు అందుబాటులో ఉండటంతో వారితో ఒక జట్టును ఎంపిక చేసి శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆడించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంక బోర్డు దీన్ని మహాప్రసాదంగా భావించింది. ఈ సిరీస్ ద్వారా వారికి రూ.70 కోట్ల ఆదాయం రానుండటం విశేషం.

ఇంకొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో ఆ టోర్నీలో ఆడబోయే చాలామంది ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుందని కూడా బీసీసీఐ భావించింది. ఐతే కోహ్లీ నేతృత్వంలో ఓ జట్టు ఇంగ్లాండ్‌లో ఉండగా.. తమ దేశానికి ఓ ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపుతోందని.. ఇది తమకు అవమానకరమని రణతుంగ వ్యాఖ్యానించాడు. కాసుల కోసం శ్రీలంక బోర్డు కక్కుర్తి పడుతోందని కూడా వ్యాఖ్యానించాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే పూర్తయింది. లంక అతి కష్టం మీద 262 పరుగులు చేస్తే.. ఇంకో 80 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సొంతం చేసుకుంది భారత్. పృథ్వీ షా, ఇషాన్ కిషన్ లాంటి పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లు లంక బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయారు. వారి ముందు లంకేయులు గల్లీ బౌలర్లలా కనిపించారు.

ధావన్ సేనను రణతుంగ సెకండ్ గ్రేడ్ టీం అన్నాడు కానీ.. నిజానికి మన జట్టు ముందు శ్రీలంక థర్డ్ గ్రేడ్ టీం లాగా కనిపించింది. ఈ సిరీస్ అంతా కూడా భారత్‌ ఆధిపత్యం సాగడం ఖాయమని తేలిపోయింది. ఐపీఎల్‌తో రాటుదేలిపోయిన కుర్రాళ్ల ముందు లంకేయులు ఏమాత్రం నిలిచే పరిస్థితి లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రణతుంగను మామూలుగా ఆడుకోవట్లేదు భారత ఫ్యాన్స్. ఆయన మీద ట్రోల్స్‌తో రెచ్చిపోతున్నారు.

This post was last modified on July 19, 2021 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

4 hours ago

అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…

6 hours ago

ఎన్నిసార్లు దొరికిపోతావు త‌మ‌న్?

టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…

6 hours ago

భయపడినట్టే దెబ్బ కొట్టిన అమరన్

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…

8 hours ago

ఆ సుకుమార్.. ఈ సుకుమార్.. ఒక్కరేనా?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…

9 hours ago

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

10 hours ago