ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఢిల్లీలో శబ్ద కాలుష్యం చేస్తే విధించే జరిమానాను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) భారీగా పెంచింది. శబ్దకాలుష్యానికి పాల్పడిన వారికి రూ. లక్ష జరిమానా విధించనుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు జరిమానాను సవరించింది.
కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత నివాసాల వద్ద కానీ , వాణిజ్య సముదాయాల వద్ద కానీ టపాసులు కాల్చినట్లయితే రూ. వెయ్యి రూపాయాలు, సైలెంట్ జోన్స్ వద్ద పేలిస్తే రూ. 3 వేల జరిమానా విధించనుంది. ఇక ర్యాలీలు, వివాహ, మతపరమైన కార్యకలాపాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నివాసాలు, వాణిజ్య సముదాయాల వద్ద టపాసులు కాల్చితే రూ. 10 వేలు, సెలైంట్జోన్లలో అయితే రూ. 20 వేలు ఫైన్ వసూలు చేయుంది.
ఒక వేళ ఇదే తప్పును రెండో సారి చేస్తే రూ. 40 వేలు ఫైన్ పడనుంది. రెండు సార్లు కన్నా ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రాకర్లు పేల్చితే లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. అదననంగా, జనరేటర్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు డిపిసిసి పలు చర్యలు తీసుకుంది. లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని పేర్కొంది.