తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడటం.. ఆ ఇంట్లో దొరికినదంతా దోచుకెళ్లడం చాలా సహజం. ఓ దొంగ కూడా అలానే దొంగతనం చేశాడు. కానీ.. అలా చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అది కూడా ఓ పోలీసు ఇంట్లో కన్నం వేసి.. దర్జాగా లో లెటర్ పెట్టి వెళ్లిపోయాడు.
ఇంట్లో డబ్బు, నగలను దోచుకెళ్లడమే కాకుండా..వెళ్లే ముందు… ఓ లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. అందులో.. తాను కావాలని దొంగతనం చేయలేదని.. పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చిందని.. క్షమించాలంటూ లో లేఖ కూడా పెట్టడం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లోని బిండ్ నగరానికి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కమలేష్ కఠారీ ఇటీవల.. తన కుటుంబంతో కలిసి ఊరు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి.. ఇంటి తలుపులన్నీ తెరచి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
ఆ పక్కనే ఓ లేఖ కూడా ఉంది. అందులో.. ” సారీ ఫ్రెండ్.. నన్ను క్షమించండి. ఇదంతా పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చింది. నా మిత్రుడి ప్రాణాలు కాపాడుకునేందుకు నేను ఈ దొంగతనం చేశాను. మళ్లీ నాకు డబ్బులు రాగానే మీ దగ్గర దోచుకుంది తిరిగి ఇచ్చేస్తానంటూ” లేఖలో పెట్టడం గమనార్హం.
కాగా… కమలేష్ కి తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on July 7, 2021 9:50 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…