ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ అయిన షెఫాలి వర్మ వయసు 17 ఏళ్లు. జట్టులో మరో కీలక సభ్యురాలైన జెమీమా రోడ్రిగ్స్ వయసేమో 20 ఏళ్లు. వీళ్లిద్దరే కాదు.. మరికొందరు భారత యువ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించే సమయానికి ఇంకా పుట్టనే లేదు. ఎప్పుడో 1999లో ఆమె తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పట్నుంచి 22 ఏళ్లుగా అలుపూ సొలుపూ లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఉంది.
మ్యాచ్ ఆడితే ఫీజు దక్కకపోగా.. సొంతంగా ప్రయాణ ఖర్చులు పెట్టుకుని మ్యాచ్‌లకు వెళ్లే రోజుల నుంచి ఇప్పుడు బీసీసీఐ పరిధిలోకి చేరడమే కాక లక్షల్లో మ్యాచ్ ఫీజులు అందుకోవడం, కోట్లమంది తమ ఆట చూసేలా ఎదిగిన భారత మహిళల క్రికెట్ ప్రయాణంలో ఆమెది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎన్నో అద్భుత రికార్డులను ఆమె సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా ఆమె గొప్ప గౌరవాన్ని అందుకుంది.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లట్ ఎడ్వర్డ్స్ ఇప్పటిదాకా మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతూ వచ్చింది. 10,273 పరుగులతో ఆమె పేరిట ఉన్న రికార్డును శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా మిథాలీ బద్దలు కొట్టింది. 23వ ఓవర్లో బౌండరీ ద్వారా ఆమె మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ అయింది. ఈ మ్యాచ్ అయ్యేసరికి ఆమె మొత్తం పరుగులు 10,337కు చేరుకున్నాయి. 11 టెస్టుల్లో 669 పరుగులు చేసిన మిథాలీ.. 217 వన్డేల్లో 7304 పరుగులు సాధించింది.
ఇక టీ20 ఫార్మాట్లో 88 మ్యాచ్‌లాడిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 2364 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించడం ద్వారా చిరస్మరణీయం చేసుకుంది. భారత్ ముందు 220 పరుగుల లక్ష్యం నిలవగా.. మిథాలీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ ఆమె పట్టుదలతో క్రీజులో నిలిచి భారత్‌కు విజయాన్నందించింది. 22 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికీ అలసిపోకుండా.. 38 ఏళ్ల వయసులోనూ ఆమె ఇంత పోరాట స్ఫూర్తితో ఆటలో కొనసాగుతుండటం అద్భుతమే.
This post was last modified on July 4, 2021 10:59 am
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…