ఇన్ స్టాగ్రామ్.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు దీనిని ఇప్పుడు తెగ వాడేస్తున్నారు. అయితే.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొందరు సెలబ్రెటీలు కోట్లు సంపాదిస్తున్నారనే విషయం మీకు తెలుసా..?
ఇన్ స్టా ద్వారా సంపాదిస్తున్న సెలెబ్రిటీల జాబితాను ప్రతీ ఏడాది హెచ్ పర్ క్యూ సంస్థ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి జాబితానే విడుదల చేసింది. దాని ప్రకారం.. ఏయే సెలబ్రెటీలు ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఒక్క పోస్ట్ తో 6లక్షల 80వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.08 కోట్లు అన్నమాట. మొత్తం జాబితాలో కోహ్లీకి 19వ స్థానం దక్కింది. టాప్ 20లో నిలిచిన ఏకైక భారత సెలెబ్రిటీ కోహ్లీ మాత్రమే.
ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా..27 వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్ స్టాలో ఒక్కో పోస్ట్ కు రూ.3 కోట్ల వరకు రాబడుతోంది. మొత్తం 395 మంది సెలెబ్రిటీలు ఉన్న ఈ లిస్టులో ఇద్దరు భారతీయులకే చోటు దక్కింది.
ఇన్ స్టా ద్వారా అధికంగా సంపాదిస్తున్న నెంబర్ వన్ సెలెబ్రిటీ ఎవరంటే… ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఇతను ఒక్కో పోస్ట్ కు రూ.11.9 కోట్లు వెనకేసుకుంటున్నాడు. రొనాల్డో తర్వాత హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.
This post was last modified on July 3, 2021 10:56 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…