ఇద్దరు కొడుకులతో కలిసి పోర్న్ చూస్తుందట

లోకో భిన్నరుచి అన్న సామెత వినేందుకు బాగానే ఉంటుంది కానీ.. కొందరి అభిరుచులు.. వారు చేసే పనులు.. తీసుకునే నిర్ణయాల గురించి తెలిసినంతనే.. ఉలిక్కిపడటమే కాదు.. పక్కనే బాంబు పడినంతగా అదిరిపడతారు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు పలు రకాలుగా ఆలోచిస్తుంటారు. వారి క్షేమం కోసం తపిస్తుంటారు. తాము చేసిన తప్పులు వారు చేయకూడదనుకుంటారు. ఇందుకోసం చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రుల కాన్సెప్టు ఒకటే అయినా అందుకు వారు అనుసరించే మార్గాలే భిన్నంగా ఉంటాయి. అయితే.. ఇండోనేషియాకు చెందిన 47 ఏళ్ల స్టార్ పాప్ సింగర్ యుని శరా చెప్పిన మాటలు వింటే షాక్ తింటాం.

పిల్లల విషయంలో తాను ఎలా వ్యవహరిస్తానన్న విషయాన్ని ఆమె చెప్పి.. హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఆమె యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీశాయి. శరాకు ఇద్దరు కొడుకులు. వారిద్దరూ టీనేజ్ వయస్కులు. వారిద్దరితో కలిసి తాను పోర్న్ వీడియోలు చూస్తానని ఆమె చెబుతున్నారు.
ఇప్పుడున్న డిజిటల్ యుగంలో దేన్ని దాచలేమని.. అందుకే చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు వారిని కట్టడి చేస్తే దొంగతనంగా అయినా వారు చేయాల్సింది చేస్తారని.. అందుకే వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన పిల్లలకు రొమాన్సును బూతులా కాకుండా ఓపెన్ మైండెడ్ గా ఆలోచించాలన్న ఉద్దేశంతో తాను అలా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

పిల్లలకు లైంగిక జీవితంపై సరైన అవగాహన కల్పించటం పేరెంట్స్ బాధ్యత అంటూ ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని చూసినోళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆమె నిర్ణయాన్ని తిట్టి పోస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెకు సపోర్టు చేస్తున్నారు. ఇదెక్కడి పైత్యం తల్లీ అని సంప్రదాయవాదులు విరుచుకుపడుతున్నారు.

పిల్లలకు మంచి చెడు చెప్పేందుకు చాలానే మార్గాలు ఉన్నాయి. అలా అని పోర్న్ వీడియోల్ని కలిసి కూర్చొని మరీ చూపించాల్సిన అవసరం ఏమిటన్న మాట వినిపిస్తోంది. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నటి విభజన రేఖ ఉంటుంది. ఆధునికత.. అవగాహన పేరుతో ఆ రేఖను తుడిచేయటం మంచిది కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.