గుడ్ న్యూస్… ఇక గర్భిణీలకూ కరోనా వ్యాక్సిన్

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను దేశంలో వేగవంతం చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు 18ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. కానీ.. చిన్నపిల్లలు, గర్భిణీలకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కాగా.. తాజాగా ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం ఓ శుభవార్త తెలియజేసింది.

గర్భిణీలకూ కరోనా వ్యాక్సిన్ టీకా వేయవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గర్భిణీల్లో టీకా ప్రయోజనాలుంటాయని.. వారికి ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఇప్పటికైతే బాలింతలు టీకా తీసుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేశారు.

త్వరలోనే గర్భిణీలకూ టీకా వేయాలని గైడెన్స్ విడుదల చేయనున్నారు. చిన్నపిల్లలకు టీకాపైనా డాక్టర్ బలరాం భార్గవ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క దేశంలో మాత్రమే పిల్లలకు వ్యాక్సిన్ వేస్తోందని చెప్పారు. 2-18 ఏళ్ల పిల్లలపై చిన్న అధ్యయనం చేపట్టామని.. త్వరలోనే దాని ఫలితాలు విడుదల అవుతాయని వెల్లడించారు.

మరీ చిన్నపిల్లలకు టీకా అవసరం రాకపోవచ్చని.. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.