వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ మెన్ జియోనా చానా ఇటీవల కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. 33 పెళ్లిళ్లు చేసుకొని.. భార్య, పిల్లలతో ఆయన పెద్ద కుటుంబంలా కలిసి ఉండటంతో.. అందరి దృష్టి ఈయనపై పడింది. ఈయన మరణ వార్త విని చాలా మంది బాధపడ్డారు. అయితే.. అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న పురుషుడు ఈయన అయితే.. అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న మహిళ ఎవరా అని కొందరికి అనుమానం కలిగింది. ఇంకేముంది ఆమె గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేయగా.. ఇదిగో ఈ మహిళ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఈమె పేరు లిండా లో టేలర్ వుల్ఫ్. ప్రపంచంలో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న మహిళగా ఈమె నిలిచింది. ఆమె ఇప్పటి వరకూ 23 మందిని పెళ్లి చేసుకుంది. వీరిలో మోసగాళ్లున్నారు. నేరస్థులున్నారు. మతబోధకులు ఉన్నారు. గేలు ఉన్నారు, సంగీత కళాకారులు ఉన్నారు. ఆమెను కొట్టి హింసించిన వాళ్లున్నారు. జీవితంలో ఏమీ లేక ఆమె వద్దే స్వాంతన పొందిన వాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే అత్యధికసార్లు పెళ్లి చేసుకున్న మహిళగా గిన్నిస్ రికార్డును కూడా ఈ 68 ఏళ్ల బామ్మ క్రియేట్ చేసింది. ప్రస్తుతం తన శేష జీవితాన్ని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గడుపుతోంది. ఆమె చేసుకున్న చివరి పెళ్లి 1996లో గ్లిన్ ‘స్కాటీ’ వుల్ఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
గ్లిన్‌ను పెళ్లి చేసుకోవడానికి వీరిద్దరి మధ్య ప్రేమ ఏమీ లేదు. గ్లిన్ అప్పటికే 28 పెళ్లిళ్లు చేసుకున్నారు. 29వ పెళ్లి కూడా చేసుకొని రికార్డు సృష్టించడం కోసం లిండాను వివాహమాడారు. పెళ్లయిన ఏడాదికే 1997లో గ్లిన్ కన్నుమూశారు. లిండా తొలిసారి 1957లో 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుందట. ఆమె తొలిభర్త జార్జ్ స్కాట్ వయసు అప్పటికే 31. ఏడేళ్లపాటు వీళ్ల సంసారం సాగింది. ఆమె జీవితంలో ఇదే సుదీర్ఘ వైవాహిక జీవితం. మిగిలిన వారెవ్వరూ ఆమెతో ఎక్కువ కాలం ఉండకపోవడం గమనార్హం.
This post was last modified on June 15, 2021 3:42 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…