టెన్నిస్‌లో ఆల్ టైం గ్రేట్ ఎవరు అంటే.. ముందుగా రోజర్ ఫెదరర్ పేరే వినిపిస్తుంది. మరెవరికీ సాధ్యం కాని విధంగా 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి నాలుగేళ్లుగా ఆ రికార్డును నిలుపుకుంటూ వచ్చాడు స్విస్ మాస్టర్. కేవలం గణాంకాల్ని బట్టే కాదు.. ఆటలో సొగసు, నిలకడ పరంగా చూసినా ఫెదరర్‌ను ‘ది బెస్ట్’గా పరిగణిస్తారు. ఐతే ఒకప్పుడు ఫెదరర్‌తో పోలిస్తే తక్కువగా కనిపించిన రఫెల్ నాదల్.. ఆ అంతరాన్ని తగ్గించుకుంటూ వచ్చేశాడు. ఫెదరర్‌తో సమానంగా 20 టైటిళ్లు సాధించి.. ఆ దిగ్గజాన్ని అధిగమించడానికి అడుగు దూరంలో నిలిచాడు. ఐతే వీళ్లను మించి ఆల్ టైం గ్రేట్‌గా అవతరిస్తాడని నొవాక్ జకోవిచ్ మీద గతంలో ఎవరికీ అంచనాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు దిగ్గజాలకు సాధ్యం కాని ఆటలతో, ఘనతలతో టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచేలా కనిపిస్తున్నాడు నొవాక్ జకోవిచ్.
గ్రాస్ కోర్టు, హార్డ్ కోర్టుల్లో ఫెదరర్‌ను మించినోడు లేడు. కానీ క్లే కోర్టులో అతను వీక్. ఫ్రెంచ్ ఓపెన్‌లో అతను గెలిచిన టైటిల్ ఒక్కటే. అది కూడా నాదల్ బరిలో లేనపుడు అతను టైటిల్ సాధించాడు. ఇక నాదల్ విషయానికి వస్తే మట్టికోర్టులో అతనెంతటి మొనగాడో అందరికీ తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏకంగా 13 టైటిళ్లు సాధించాడతను. కానీ హార్డ్ కోర్టులో అతను బలహీనుడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒకేసారి విజేతగా నిలిచాడు. కానీ జకోవిచ్ అలా కాదు.. హార్డ్, గ్రాస్, క్లే.. ఇలా ఏ కోర్టులో అయినా మొనగాడే. తాజాగా అతను టైటిల్ ఫేవరెట్ నాదల్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండోసారి గెలుచుకోవడానికి అడుగు దూరంలో నిలిచాడు.
ఫైనల్లో సిట్సిపాస్‌ను జకోవిచ్ ఓడించి 19వ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకోవడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఈ విజయం సాధిస్తే టెన్నిస్ చరిత్రలోనే ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం రెండుసార్లు సాధించిన ఏకైక ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టిస్తాడు. శుక్రవారం రాత్రి నాదల్‌తో సెమీఫైనల్‌లో జకోవిచ్ ఆట చూసిన వాళ్లెవరైనా అతనో కంప్లీట్ ప్లేయర్ అనకుండా ఉండలేరు. నాదల్ కోటలో తొలి సెట్లో 0-5తో వెనుకబడి, ఆ సెట్‌ను కూడా కోల్పోయి అతడి మీద గెలవడమంటే మాటలు కాదు. సెమీఫైనల్, అంతకంటే ఎక్కువ దశలో ఇన్నేళ్లలో నాదల్‌ను ఎవ్వరూ ఓడించలేదు. ఆ ఘనత నొవాక్‌కే దక్కింది. జకోవిచ్ ఊపు చూస్తుంటే ఫెదరర్, నాదల్‌లను వెనక్కి నెట్టి అత్యధిక టైటిళ్ల రికార్డును తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on June 12, 2021 1:53 pm
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…