బ్లాక్ బస్టర్ మూవీ ధూమ్ గుర్తుందా? అందులో భారీ దొంగతనాలు చేసే ఘరానా దొంగ పోలీసులు ఎంత ప్రయత్నించినా దొరకడు. హీరో పోలీసుకు ఏ మాత్రం తీసిపోని దొంగ హీరోయిజం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రీల్ కు ఏ మాత్రం తీసిపోని ఒక రియల్ సీన్ హైదరాబాద్ పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక దొంగ పోలీసులకు వీడియో కాల్ చేసి.. నా ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలాంటి బంఫర్ ఆఫర్ ఎప్పుడు ఇవ్వను. మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి ఇదైనా అని చెప్పటమే కాదు.. మీరు నన్ను పట్టుకోలేరు.. నాకు నేనుగా మీకు చిక్కితే తప్పిస్తే అంటూ సవాలు విసరటమే కాదు.. చివర్లో ఊహించని ట్విస్టు ఇచ్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ ఈ దొంగ ఎవరు? అతడు చేసిన దొంగతనం ఏ స్థాయిది? అన్న విషయాల్లోకి వెళితే.. సినిమా చూసిన అనుభవానికి లోనుకావటం ఖాయం.
కొద్ది నెలల క్రితం కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే సినీ నిర్మాత హైదరాబాద్ కు రావటం..బంజారాహిల్స్ లోని పార్కు హయత్ స్టార్ హోటల్లో బస చేయటం తెలిసిందే. అతగాడి ఫార్చ్యునర్ కారును హోటల్ పార్కింగ్ లో పార్కు చేయగా.. తర్వాతి రోజు వచ్చేసరికి ఆ కారు కనిపించకపోవటం సంచలనమైంది. కారులో బంగారు గణపతి విగ్రహంతో పాటు.. పలు భూములకు చెందిన డాక్యుమెంట్లు ఉన్నాయి. కారు పోతే పోయింది.. ఆ భూముల పత్రాలు కోసం మంజునాథ్ కిందా మీదా పడుతున్నారు.
ఈ కేసును ప్రిస్టేజ్ తో తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయటం షురూ చేశారు. ఎంతో కసరత్తు చేసిన తర్వాత ఆ దొంగ మామూలోడు కాదని.. ఖరీదైన దొంగతనాలు ఇప్పటికే 56 చేసినట్లుగా అతడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. విపరీతమైన శ్రమతో అతడిది రాజస్థాన్ అన్న విషయాన్ని గుర్తించారు. అతడ్ని ఏదో విధంగా పట్టుకోవాలన్న పట్టుదలతో అతడున్న ఊరికి వెళ్లారు. అతడ్ని పట్టుకున్నామన్న హ్యాపీలో ఉన్న వారికి అనుకోని రీతిలో ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి ఒక వీడియో కాల్ వచ్చింది.
ఆ కాల్ చేసింది ఎవరో కాదు.. పోలీసులు వెతుకుతున్న ఘరానా దొంగనే. తాను ఎప్పుడూ ఫోన్ చేయనని.. ఈసారి చేసినట్లుగా చెప్పిన అతడు.. పోలీసులకు తన తీరుతో షాకుల మీద షాకులు ఇచ్చాడు. “మీరు నన్ను అరెస్టు చేయలేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీరు ఏ హోటల్ లో ఉన్నారు. మీకు సమాచారం ఇస్తున్న వాళ్లు ఎవరన్న విషయాలన్ని నాకు తెలుసు. నాకు నేనుగా మీకు దొరకాలే కానీ మీరు నన్ను పట్టుకోలేరు. నా కోసం ఎంతో మంది పోలీసులు గాలిస్తున్నారు. కానీ.. వారందరిలోకి మీరే బెస్టు. ఎందుకంటే.. నన్ను గుర్తించి ఇంత దూరం రాగలిగారు. అలా వచ్చినోళ్లు కూడా మీరే. అందుకే ఫోన్ చేస్తున్నా. నా ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోండి” అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడట.
అంతేకాదు..మీరున్న చోటుకు దగ్గర్లో మాంచి హోటల్ ఉందని పేరు చెప్పి.. అక్కడ భోజనం చేయాలని దానికి బిల్ తానే పే చేస్తానని కూడా చెప్పటంతో అవాక్కు కావటం పోలీసుల వంతైంది. తనకు తోచినప్పుడు తాను చోరీ చేసిన కారును వదిలేస్తానని.. అప్పటివరకు తనను పట్టుకునే ప్రయత్నాలు మానుకోవాలని సూచన చేశాడట. అతగాడి మాటలతో మరింత పట్టుదలకు పోయిన బంజారాహిల్స్ పోలీసులు దాదాపు పదిహేను రోజులు గాలించి ఏమీ చేయలేక.. ఏమీ చేయలేమన్న విషయాన్ని గుర్తించి ఉత్త చేతలతో తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. మరి.. ఈ ‘ధూమ్’ దొంగను హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటారో లేదో చూడాలి.
This post was last modified on June 10, 2021 11:58 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…